విక్రమ్‌ల్యాండర్ స్థితిగతులపై ఫోటోలు తీయనున్న నాసా ఆర్బిటార్

చంద్రయాన్-2 మిషన్ కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్ పరిస్థితి ఎలా ఉంది? తలకిందులుగా పడిందా? నిద్రాణస్థితిలోకి ఎలా జారింది? దీనికి గల కారణాలేంటీ? నిరంతరాయంగా వేర్వేరు రూపాల్లో పంపిస్తోన్న రేడియో సంకేతాలను ఎందుకు పసిగట్టలేకపోతోంది? ప్రస్తుత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను కంటి మీద కునకు లేకుండా చేస్తోన్న ప్రశ్నలు ఇవి. ఇందులో ఏ ఒక్క ప్రశ్నకూ ఇస్రో శాస్త్రవేత్తల వద్ద సరైన సమాధానం లేదు. చివరికి అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధక కేంద్రం (నాసా) పంపిస్తోన్న సంకేతాలను కూడా విక్రమ్ ల్యాండర్ గ్రహించట్లేదంటే.. దాని పరిస్థితి ఆందోళనకరంగానే ఉండొచ్చనే అనుమానాలు శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్నాయి.

వారి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికే క్షణం రానుంది. మరో కొద్ది గంటల్లో విక్రమ్ ల్యాండర్ వాస్తవ ఫొటోలు ఇస్రో శాస్త్రవేత్తల చేతికి అందబోతున్నాయి. నాసా ఇదివరకే అంతరిక్షంలోకి ప్రయోగించిన లూనార్ రికాయిన్నెసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) విక్రమ్ ల్యాండర్ ఫొటోలను తీయబోతోంది. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఈ ఎల్ఆర్ఓ..

Chandrayaan -2 live updates: Nasas orbitor to determine the fate of Vikram Lander

చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగినట్లుగా భావిస్తోన్న ప్రదేశానికి సంబంధించిన ఫొటోలను చిత్రీకరించబోతోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా నాసా పూర్తి చేసింది. లూనార్ ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి సంబంధించిన ఫొటోలు తమకు అందగానే.. వాటిని ఇస్రో శాస్త్రవేత్తలకు అందజేస్తామని నాసా ఇదివరకే వెల్లడించింది.

Sep 17, 2019, 5:03 pm IST

చంద్రయాన్ 2 ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయి ఇప్పటికే 10 రోజులు దాటింది. ఇంకా సంబంధాలు పునరుద్ధరణ కోసం మరో నాలుగురోజుల సమయం మాత్రమే ఇస్రోకు ఉంది
Sep 17, 2019, 3:42 pm IST

చంద్రుడిపై సూర్యుడి వెలుతురు ఫేడ్ అవుతుంది కాబట్టి విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించి నాసా ఆర్బిటార్ తీసే ఫోటోలు స్పష్టంగా వచ్చే అవకాశం లేదు
Sep 17, 2019, 1:34 pm IST

చంద్రుడిపై ఉన్న నీటి ఆనవాల నాణ్యతను ఆర్బిటార్ పరిశీలించి ఫోటోలు పంపుతుంది
Sep 17, 2019, 1:31 pm IST

చివరి రోజు సంబంధాలు దొరికినా విక్రమ్‌ ల్యాండర్‌కు చార్జింగ్ ఇచ్చేందుకు సదుపాయం లేదు
Sep 17, 2019, 1:31 pm IST

సెప్టెంబర్ 21కి ముగియనున్న చంద్రయాన్ -2 మిషన్. ఇప్పటి వరకు విక్రమ్ ల్యాండర్‌తో దొరకని సంబంధాలు
Sep 17, 2019, 1:25 pm IST

చంద్రుడిపై ఉన్న ధృవ ప్రాంతాల్లో తిరిగి అక్కడి సమాచారం సేకరించడమే నాసా ఆర్బిటార్ ప్రధాన టాస్క్
Sep 17, 2019, 1:24 pm IST

లూనార్ రీకానైసా ఆర్బిటార్(ఎల్‌ఆర్‌ఓ)సేకరించిన సమాచారంతో మానవుడు చంద్రుడిపైకి వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చేలా ప్లాన్
Sep 17, 2019, 1:22 pm IST

2009లో లూనార్ రీకానైసా ఆర్బిటార్‌ను లాంచ్ చేసిన నాసా
Sep 17, 2019, 1:21 pm IST

అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం ఫోటోలు తీయనున్న నాసా ఆర్బిటార్
Sep 17, 2019, 1:20 pm IST

ఇప్పటికే విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించి సమాచారం సేకరించిన నాసా
Sep 17, 2019, 1:18 pm IST

మరికొద్ది గంటల్లో విక్రమ్ ల్యాండర్ స్థితిగతులపై ఫోటోలు తీయనున్న నాసా ఆర్బిటార్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+