Chandrayaan 3: మరో మైలురాయిని అధిగమించిన మిషన్..!!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్.. చంద్రయాన్ 3. ఈ మిషన్ ఇంటిగ్రేటెడ్ మాడ్యుల్ డైనమిక్ టెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసింది.
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. ఈ ప్రాజెక్ట్ కీలక దశను పూర్తి చేసుకుంది. అంతరిక్ష ప్రయోగ సమయంలో ఎదురయ్యే అత్యంత కఠినమైన ప్రకంపనలను ఈ రాకెట్ తట్టుకుంటుందా? లేదా? అనే పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది.
ఇది రెండో టెస్ట్. ఇదివరకు చంద్రయాన్ 3 రాకెట్ ఇంజిన్ ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. 25 సెకెండ్ల ఇంజిన్ ను మండించారు. ల్యాండర్ ను చంద్రుడిపైకి మోసుకెళ్లడానికి అవసరమైన లాంచింగ్ వెహికల్ క్రయోజనిక్ ఇంజిన్ సీ-20 అది. తమిళనాడులోని మహేంద్రగిరిలో గల ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ లో ఈ నెల 24వ తేదీన ఈ టెస్ట్ ఫైర్ చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఇంటిగ్రేటెడ్ మాడ్యుల్ డైనమిక్ పరీక్షలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది.
Chandrayaan-3 has successfully undergone its vibration and acoustic tests!!
— Debapratim (@debapratim_) March 16, 2023
And we finally have images of the integrated CY-3 stack 🤯 #Chandrayaan3 #ISRO pic.twitter.com/rOrHoFspY4
దీనితో రెండు దశల్లో చంద్రయాన్ మిషన్ 3 ప్రయోగాలను విజయవంతంగా ముగించినట్టయింది. ఇక మూడో దశలో- చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన ల్యాండర్ ను టెస్ట్ చేయాల్సి ఉంది. దీనికోసం ఎలక్ట్రో మేగ్నటిక్ ఇంటర్‌ఫెరెన్స్/ఎలక్ట్రో మేగ్నటిక్ కాంపటిబిలిటీ టెస్ట్ కోసం బెంగళూరు పీణ్యాలోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ కు పంపించారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్, ఆటో కాంపాబిలిటీ టెస్ట్, యాంటెన్న పోలరైజేషన్, ల్యాండర్, దానికి అమర్చిన రోవర్ ను పరీక్షిస్తోన్నారు.

ఈ ఏడాది జులై/ఆగస్టు మధ్యకాలంలో తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 మిషన్ ను చంద్రుడిపైకి పంపిస్తారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. ఇస్రో తురుఫుముక్క లాంచ్ వెహికల్ మార్క్ 3.. చంద్రయాన్ 3 ల్యాండర్ ను నింగిలోకి మోసుకెళ్తుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తున గల కక్ష్యలోకి దీన్ని లాంచ్ చేస్తుంది. అనంతరం ఈ ల్యాండర్ ను శాస్త్రవేత్తలు చంద్రుడిపై ల్యాండ్ చేస్తారు.
-
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఏం ప్లాన్ చేశావ్ భాయ్ -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !!












Click it and Unblock the Notifications