Chandrayaan-3: చంద్రుడి ఉపరితలంపై సహజ ప్రకంపనలు, ఇస్రో అప్‌డేట్ ఇదే

బెంగళూరు: చంద్రయాన్-3(Chandrayaan-3) చంద్రుడిపై పరిశోధనలు కొనసాగిస్తోంది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు, సల్ఫర్ వంటి మూలకాల లభ్యత తదితర సమాచారాన్ని ఇప్పటికే తెలియజేసింది. చంద్రయాన్-3 పేలోడ్‌లు.. తాజాగా, ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. గురువారం మరో కీలక సమాచారాన్ని తెలియజేసింది.

విక్రమ్ ల్యాండర్‌లోని ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిస్మిక్ యాక్టివిటీ(ILSA) పేలోడ్.. తాజాగా, చంద్రుడిపై సహజ ప్రకంపనలను నమోదు చేసింది. ఈ మేరకు వివరాలను తెలుపుతూ ఇస్రో(ISRO) తాజాగా ట్వీట్ చేసింది.

Chandrayaan-3: Vikram Detects Natural Movement On Lunar Surface

'చంద్రయాన్-3 ల్యాండర్‌లోని ఇల్సా పేలోడ్.. చంద్రుడి ఉపరితలంపై రోవర్, ఇతర పేలోడ్‌ల కారణంగా ఏర్పడిన ప్రకంపనలు నమోదు చేసింది. వీటిని అదనంగా.. అక్కడ సహజంగా ఏర్పడినట్లు భావిస్తోన్న ప్రకంపనలనూ గుర్తించింది. ఆగస్టు 26న వాటిని నమోదు చేసింది. వాటి మూలాన్ని గుర్తించే దిశగా అన్వేషణ సాగుతోంది' అని తెలిపింది.

అయితే, ఇల్సా పేలోడ్.. చంద్రుడిపై మొట్టమొదటి మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ సాంకేతికత ఆధారిత పరికరం అని ఇస్రో వెల్లడించింది. ఇల్సా పేలోడ్‌ను లేబోరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ రూపొందించిందని పేర్కొంది. దీన్ని చంద్రుడి ఉపరితలంపై మోహరించే యంత్రాంగాన్ని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసిందని వెల్లడించింది.

కాగా, అంతకుముందు విక్రమ్ ల్యాండర్‌లో మరో పరికరం చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో ఉపరితలం సమీపంలో మొదటిసారి ప్మాస్మా కణాల కొలతలను పంపింది. దీంతో చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా చాలా తక్కువగా ఉందని ఇస్రో ప్రాథమిక అంచనాకు వచ్చింది. మరోవైపు, సల్ఫర్, ఇతర మూలకాలు కూడా ఉన్నాయని ఇంతకుముందు కనుగొన్న విషయం తెలిసిందే. ఆక్సిజన్ నిల్వలు కూడా కొంతమేర ఉన్నాయని తెలియజేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+