Chandrayaan 3: నిద్రలోకి జారుకున్నవిక్రమ్: మళ్లీ మేల్కొనేది అప్పుడే: ఇస్రో కొండంత ఆశలు
బెంగళూరు: చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన పరిశోధనలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చంద్రయాన్ 3లో భాగంగా ఇస్రో పంపించిన విక్రమ్ ల్యాండర్.. నిద్రలోకి జారుకుంది. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభం కావడం దీనికి కారణం. అక్కడ ఒక్క రాత్రి గడిచిపోవడం అంటే.. భూమి మీద 14 రాత్రులతో సమానం.
విక్రమ్ ల్యాండర్ స్లీప్ మోడ్‌లోకి వెళ్లేలా ఈ ఉదయం 8 గంటలకు సమయాన్ని సెట్ చేసింది ఇస్రో. చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఛాస్టే), రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్- లాంగ్ముయిర్ ప్రోబ్ (రంభా ఎల్పీ),ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ).. వంటి ఇన్-సిటు పేలోడ్స్ అన్నీ కూడా టర్న్ ఆఫ్ అయ్యాయి.

ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ ఒక్కటే తన పని తాను చేసుకుంటుంది. చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇస్రో కమాండ్ కంట్రోల్ స్టేషన్‌కు పంపిస్తోంది. సౌర విద్యుత్ ఆధారంగా పని చేసే బ్యాటరీని ఇందులో అమర్చారు శాస్త్రవేత్తలు. ఈ బ్యాటరీ ఛార్జ్ అయిపోయేంత వరకూ అది పని చేస్తూనే ఉంటుంది.
ఛార్జ్ అయిపోయే సమయంలో రోవర్ కూడా విక్రమ్ ల్యాండర్ వద్దకు చేరుకుని స్లీప్ మోడ్‌లోకి వెళ్తుంది. చంద్రుడిపై సూర్యకాంతి ప్రసరించడం ఆగిపోవడం, రాత్రి సమయం ఆరంభం కావడం వల్ల ల్యాండర్, రోవర్‌ను స్లీప్ మోడ్‌లోకి వెళ్లేలా సెట్ చేసింది ఇస్రో. ఒక్క రిసీవర్ మాత్రమే స్విచాన్‌లో ఉందని, అది రాత్రివేళ కూడా పని చేస్తుందని తెలిపింది.
మళ్లీ ఈ నెల 22వ తేదీన ల్యాండర్, రోవర్ మేల్కొంటాయని పేర్కొంది ఇస్రో. 22వ తేదీన చంద్రుడిపై పగటి సమయం ఆరంభమౌతుందని, అప్పటివరకు ఈ రెండూ కూడా అక్కడి అతి శీతల వాతావరణానికి తట్టుకుని ఉంటాయని ఆశిస్తోంది ఇస్రో.
చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరిగి రావడానికి 28 రోజుల సమయం పడుతుందనే విషయం తెలిసిందే. ఇందులో 14 రోజులు సూర్యుడి వెలుగులో.. మరో 14 రోజులు చీకట్లో ఉంటుంది చందమామ. చీకటి రోజులు ఆరంభమైనప్పుడు చంద్రుడి ఉపరితలంపై తీవ్రమైన చలి ఆరంభమౌతుంది.
భూమి మీద 14 రోజుల కాలం.. ఒక లూనార్ నైట్‌తో సమానం. చంద్రుడిపై ఒక్క రాత్రి గడిచిపోవాలంటే భూమి మీద 14 రోజుల సమయం పడుతుంది. 14 రోజుల పాటు కాలంలో చంద్రుడి దక్షిణ ధృవంపై నమోదయ్యే ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలు. చంద్రుడి ఈక్వేటర్ వద్ద చలి తీవ్రత కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఈక్వేటర్ సమీపంలో మైనస్ 208 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది.
గడ్డ కట్టించే ఇంత తీవ్రమైన చలిని తట్టుకుని నిలిచే శక్తి ప్రజ్ఞాన్ రోవర్‌కు లేదు. ఈ 14 రోజుల కాలం గడిచిపోయి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే సమయానికి ఈ రోవర్ మనుగడ కొనసాగించగలుగుతుందా? లేదా? అనేది సవాల్‌గా మారింది. ఫలితంగా- ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications