సుదర్శన్ టీవీ షో కేసు ధర్మాసనంలో స్వల్ప మార్పు: జస్టిస్ జోసెఫ్ స్థానంలో ఇందిరా బెనర్జీ
సుదర్శన్ టీవీ 'యూపీఎస్సీ జిహాద్' కార్యక్రమంపై విచారిస్తోన్న సుప్రీంకోర్టు త్రి సభ్య ధర్మాసనంలో స్వల్ప మార్పులు జరిగాయి. జస్టిస్ జోసెఫ్ బెంచ్ నుంచి మారగా.. జస్టిస్ బెనర్జీ వచ్చారు. అయితే ఇదీ సాధారణంగా జరిగే ప్రక్రియే అని సుప్రీంకోర్టు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదీ కొత్త జరుగుతోన్న ప్రక్రియ కాదు అని తెలిపింది.
సుదర్శన్ టీబీ యూపీఎస్సీ జిహాద్ పేరుతో షో నిర్వహిస్తోంది. ముస్లింలు సివిల్ సర్వీసుల్లోకి రావడంపై కార్యక్రమం చేస్తోంది. అయితే దీనిపై దుమారం రేగింది. కొందరు కోర్టును ఆశ్రయించడంతో.. సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ కేఎం జేసెఫ్ కేసును విచారించారు. గతనెల 24వ తేదీన కూడా త్రిసభ్య ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది. అయితే తదుపరి విచారణ అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.

ఇంతలో జస్టిస్ కేఎం జోసెఫ్ స్థానంలో ఇందిరా బెనర్జీని నియమించారు. దీంతో ప్రాధాన్యం ఏర్పడింది. కానీ సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ కార్యాలయ వర్గాలు మాత్రం తేలికగా తీసుకుంటున్నాయి. ఇదీ రొటిన్‌గా జరిగే ప్రక్రియ అని చెబుతున్నాయి. ఇదొక్కటే కాదు ఎనిమిది ధర్మాసనాల్లో మార్పులు జరిగాయని వివరించింది. సుదర్శన్ టీవీ యూపీఎస్సీ జిహాద్ కార్యక్రమాన్ని అంతకుముందు గల త్రిసభ్య ధర్మాసనం సెప్టెంబర్ 15వ తేదీన స్టే విధించిన సంగతి తెలిసిందే.
Recommended Video
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications