పక్కనే ఉంటాం, షాకయ్యాం, మరో రెండ్రోజులైనా వేచి చూస్తాం: శ్రీదేవి నివాసం వద్ద..
Recommended Video

ముంబై: సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో శ్రీదేవి భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. లోఖండ్‌వాలాలోని ఆమె నివాసం నుంచి ఇక్కడకు తరలించారు.
దీంతో అభిమానులు, ప్రముఖులు కడసారి చూపు కోసం వచ్చారు. చిరంజీవి, ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్, సంజీవ్ కపూర్, సోనమ్ కపూర్, ఊర్వశి, ఆదిత్య థాకరే, సల్మాన్ ఖాన్, హేమమాలిని, అక్షయ్ ఖన్నా, సుస్మితా సేన్ తదితరులు వచ్చారు.

మీడియాకు ఆంక్షలు
శ్రీదేవి భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఆమె ఫ్యామిలీ కుటుంబం మీడియా ప్రతినిధులకు అనుమతిచ్చింది. అయితే లోపలికి వచ్చేటప్పుడు కెమెరాలు, వాయిస్ రికార్డర్లులాంటి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని ఆంక్షలు విధించింది. ఎవ్వరూ శ్రీదేవి భౌతికకాయం ఫొటోలను తీయవద్దని కోరారు.

ఫోటోలు తీసుకునేందుకు
పోలీసులు, ప్రయివేటు సెక్యూరిటీతో శ్రీదేవి నివాసం వద్ద, సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీదేవిని చూసేందుకు అశేష అభిమానులు తరలి వచ్చారు. అంతకుముందు, శ్రీదేవి భౌతికకాయం తరలిస్తుండగా మొబైల్స్‌తో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.

మరో రెండు రోజులు అయినా వేచి చూస్తాం
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదిత్య అనే ఇరవై ఏళ్ల అభిమాని మాట్లాడుతూ.. ఆమెకు తాము పెద్ద అభిమానులమని, ఆమెనే తమకు ప్రపంచమని, ఆమెను చూడకుండా మేం ఇక్కడి నుంచి కదలమని, ఇప్పటికే రెండు రోజులు వేచి చూశామని, మరో రెండు రోజులు చూసేందుకు సిద్ధమన్నారు. తాము కుటుంబంతో సహా శ్రీదేవిని చివరిసారిగా చూసేందుకు వచ్చామన్నారు.

పక్కనే ఉంటాం, షాకవుతున్నాం
రాహుల్ దీక్షిత్ అనే మరో అభిమాని మాట్లాడుతూ.. నేను ఇక్కడికి సమీపంలోను ఉంటానని, గతంలో రెండుసార్లు చూశానని, కానీ ఇప్పుడు విగతజీవిగా వస్తున్న ఆమెను చూడాల్సి రావడంతో షాక్ అవుతున్నానని చెప్పారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications