మరో షాక్: ఎస్‌బీఐలో ఖాతా రద్దు చేసుకున్నా బాదుడే!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు మరో షాకిచ్చింది. ఆ బ్యాంకులో ఖాతాను వద్దనుకొనే వారి నుంచి రూ.575 ఛార్జీ వసూలు చేస్తుండడంతో ఖాతాదారులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు మరో షాకిచ్చింది. ఆ బ్యాంకులో ఖాతాను వద్దనుకొనే వారి నుంచి రూ.575 ఛార్జీ వసూలు చేస్తుండడంతో ఖాతాదారులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
ఇప్పటికే ఎస్‌బీఐలో వినియోగదారుల కనిష్ఠ డిపాజిట్‌ను మహా నగరాల్లో రూ.5 వేలు, నగరాల్లో రూ.3 వేలు, చిన్న నగరాల్లో రూ.2 వేలు, గ్రామాల్లో రూ.1,000గా నిర్ణయించిన విషయం తెలిసిందే.

అంతేగాక, ఖాతాల్లో డిపాజిట్ సక్రమంగా లేకపోతే దానికి తగ్గట్టుగా జరిమానా విధిస్తోంది. దీంతో ఎస్‌బీఐలో ఖాతాలు కలిగిన పలువురు తమ ఖాతాలను రద్దు చేసుకొనేందుకు బ్యాంకుకు వెళ్లగా అధికారులు రూ.575 ఛార్జీలను వసూలు చేస్తున్నారు.
ఇదే విధంగా కరెంట్ అకౌంట్ రద్దు చేయదలచుకొనే వారికి రూ.1,000ల జరిమానాను వసూలు చేస్తుండడంతో ఖాతాదారులు ఖంగుతింటున్నారు. ప్రస్తుతం బ్యాంకుల తీరుతో వినియోగదారులు బ్యాంకుల్లో కొత్తగా ఖాతా తెరవాలంటేనే భయపడే పరిస్థితి దాపురించిందని పలువురు వాపోతున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications