వినియోగదారులకు ChatGPT బిగ్ షాక్

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులను ఆకర్షించిన కృత్రిమ మేధస్సు (AI) చాట్‌బాట్ చాట్ జీబీటీ (ChatGPT) సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికా, భారతదేశంతో సహా పలు దేశాల నుండి వినియోగదారులు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చాట్ జీబీటీ సేవలు నిలిచిపోవడంతో రోజువారీ పనులు, అకడమిక్ ప్రాజెక్టులు, మరియు వృత్తిపరమైన కార్యకలాపాలకు AIపై ఆధారపడిన అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఓపెన్ AI (OpenAI) అభివృద్ధి చేసిన చాట్ జీబీటీ, సంభాషణ నైపుణ్యాలతో పాటు, కంటెంట్ సృష్టి, కోడింగ్, సమాచార శోధన వంటి అనేక పనులకు విస్తృతంగా ఉపయోగించబడుతోంది. సేవల్లో అంతరాయం ఏర్పడటంతో, వినియోగదారులు చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయలేకపోవడం, ప్రశ్నలకు సమాధానాలు రాకపోవడం, లేదా ఆలస్యంగా స్పందించడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికల్లో #ChatGPTDown అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది.

Chatgpt services stopped

తొలిసారిగా, చాట్ జీబీటీ వెబ్‌సైట్ , APIలో ఒకేసారి అంతరాయం ఏర్పడింది. ఓపెన్ AI సంస్థ సాంకేతిక సమస్యను గుర్తించి, దానిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో సేవలు పునరుద్ధరించబడతాయని ప్రకటించింది. ఈ సంఘటన AI సేవలను నిరంతరం అందుబాటులో ఉంచాల్సిన ఆవశ్యకతను, సాంకేతిక లోపాలు వినియోగదారులపై చూపే ప్రభావాన్ని మరోసారి గుర్తుచేసింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ అంతరాయం సంభవించినట్లు ChatGPT యాజమాన్యం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+