చికెన్ తిని బలం పెంచుతా, వారం సెలవు కావాలి: రైల్వే ఉద్యోగి లేఖ, వైరల్

చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని రైల్వే ఉద్యోగి ఒకరు.. తనకు చికెన్ తినేందుకు సెలవు కావాలని లేఖ రాశాడు. ఇప్పుడు అది నెట్లో వైరల్ అయింది. అతను ఓ పేజీ లేఖను రాశాడు. ఆయన స్టేషన్ మాస్టర్‌కు ఈ లేఖ రా

నయా రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని రైల్వే ఉద్యోగి ఒకరు.. తనకు చికెన్ తినేందుకు సెలవు కావాలని లేఖ రాశాడు. ఇప్పుడు అది నెట్లో వైరల్ అయింది.

అతను ఓ పేజీ లేఖను రాశాడు. ఆయన స్టేషన్ మాస్టర్‌కు ఈ లేఖ రాశాడు. ఆ ఉద్యోగి పేరు పంకజ్ రాజ్. స్టేషన్లో టిఏ2 ఉద్యోగి. శ్రావణ మాసం ప్రారంభం కాకముందే చికెన్ తినేందుకు వారం పాటు సెలవు కావాలని లేఖలో పేర్కొన్నాడు.

Chattisgarh Railway employee's letter seeking 'leave to eat chicken' goes viral

శ్రావణ మాసం త్వరలో ప్రారంభం కానుందని, అప్పుడు తాను నాన్ వెజ్ తినలేనని, నెల రోజుల పాటు మాంసాహారం ముట్టనని లేఖలో పేర్కొన్నాడు.

కాబట్టి ఓ వారం పాటు సెలవు కావాలని, జూన్ 20వ తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు కావాలని కోరాడు. తాను కావాల్సినంత చికెన్ తిని ఎనర్జీ పొందేందుకు సెలవు కావాలని పేర్కొన్నాడు.

ఈ లేఖ పైన సంబంధింత స్టాంప్ కూడా ఉంది. దీంతో ఇది వైరల్ అయింది. పంకజ్ స్టేషన్లో పోర్టర్‌గా పని చేస్తున్నాడు.

తదుపర నెల స్టేషన్లో పని చేసేందుకు కావాల్సినంత శక్తి కోసం చికెన్ తినేందుకు తనకు లీవ్ కావాలని కోరాడు. తనకు వారం రోజులు సెలవు ఇస్తే అన్ని రోజులు చికెన్ బాగా తింటానని పేర్కొన్నాడు. అప్పుడు వచ్చే నెల పని చేసే శక్తిని సంపాదిస్తానని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+