నిత్య పెళ్లికొడుకు అరెస్టు, మహిళా ఇంజనీర్ చొరవ

Cheat on name of marraiges arrested
చెన్నై: ఓ మహిళా ఇంజనీర్ నిత్య పెళ్లికొడుకును అరెస్టు చేయించింది. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. ఇంజనీర్‌గా పనిచేస్తున్న మదురవాయిల్‌కు చెందిన సరోజిని ఇంటర్నెట్ మాట్రిమోనియల్ ద్వారా అత్తిపాక్కంకు చెందిన ఆంథోనీ క్రూస్‌కు పరిచయమైంది. తాను అనాథనని, సొంతంగా అదే ప్రాంతంలో పార్సిల్ సర్వీసు నడుపుతున్నానని అతను సరోజినికి చెప్పాడు.

ఆ తర్వాత వారిద్దరు తిరువేర్కాడులోని ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆరో రోజులు మాత్రమే సరోజినితో కాపురం చేసిన ఆంథోనీ క్రూస్ సొంత వూరు వెళ్తున్నట్లు చెప్పి పరారయ్యాడు. అనుమానం వచ్చిన సరోజిని విచారణ జరపగా ఆంథోనీ నిజస్వరూపం బయటపడింది. అతను అంతకు ముందు చాలా మందిని వివాహం చేసుకున్నట్లు తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆంథోనీ క్రూస్ అంతకు ముందు మరో ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు విచారణలో తేలింది. 1997లో తన అత్త కూతురు సహాయ మేరీని వివాహమాడాడు. సహాయమేరీ ఆత్మహత్య చేసుకోవడంతో 2007లో సేలంలోని సూరమంగళంకు చెందిన ఉపాధ్యాయురాలు ఉత్తరమేరిని పెళ్లి చేసుకున్నాడు. ఆమతో ఏడు నెలల పాటు కాపురం చేశాడు.

2013లో కోవైకి చెందిన భర్త చనిపోయిన హేమావతిని వలలో వేసుకున్నాడు. అంతే కాకుండా ఆమె వద్ద నాలుగు లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. అక్కడి నుంచి పరారై ఇంజనీర్ సరోజినిని పెళ్లి చేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+