Cheating: ఫేస్ బుక్ లో అమ్మాయిలు, ఆంటీలకు వల, కోరియర్ లోనే బంగారు, క్యాష్ లాక్కున్న కేటుగాడు !

చెన్నై/మదురై/కోయంబత్తూరు: ఇంజనీరింగ్ చదువుకు మద్యలోనే నామం పెట్టిన యువకుడు అతని కుటుంబ సభ్యులు ఇస్తున్న డబ్బులు చేతి ఖర్చులకు సరిపోవడం లేదని, ఎలాగైనా ఉద్దరగా డబ్బులు సంపాదించాలని ఆలోచించాడు. ఎక్కువగా సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న ఆ యువకుడు కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళలను టార్గెట్ చేసుకున్నాడు. ఫేస్ బుక్ లో అందంగా ఉన్న ఇద్దరు వేరే అబ్బాయిల ఫోటోలు పెట్టిన కేటుగాడు కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళలను పరిచయం చేసుకున్నాడు. తరువాత ప్రేమ పేరుతో అమ్మాయిలను, వ్యామోహంతో ఉన్న వివాహిత మహిళలతో ఆన్ లైన్ డేటింగ్ చేస్తున్నట్లు నటించి వారితో మాట్లాడాడు.

ఫేస్ బుక్ లో పరిచయం అయిన వారితో అతను ఫోన్ లో మాట్లాడుతూ వారికి సెక్స్ జోకులు వేసి వారికి పిచ్చి ఎక్కిపోయే బూతులు మాట్లాడాడు. ఇలా కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళలకు మాయమాటలు చెప్పి వారి దగ్గర ఇప్పటి వరకు కొన్ని లక్షల రూపాయల విలువైన బంగారు నగలు లాక్కొని, గూగుల్ పే ద్వారా లక్షలాది రూపాయలు లాక్కొన్నాడు. ఆ యువకుడు ఇంత వరకు ఒక్కరికి కూడా కనపడకుండా కోరియర్ లోనే బంగారు నగలు తెప్పించుకున్నాడని వెలుగు చూడటం కలకలం రేపింది. కేటుగాడి బాధితుల జాబితాలో 15 మందికి పైగా కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళలు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు.

 కేసు పెట్టిన చెన్నై యువతి

కేసు పెట్టిన చెన్నై యువతి

ఫేస్ బుక్ లో పరిచయం అయిన నిశాంత్ అనే యువకుడు తనతో వాట్సాప్ లో చాటింగ్ చేశాడని, తరువాత సెక్సీగా మెసేజ్ లు చేసి, వీడియో కాల్స్ చేసి మాయమాటలు చెప్పి తరువాత బ్లాక్ మెయిల్ చేసి రెండు లక్షల రూపాయల విలువైన నగలు, 50 వేల నగదు ఇప్పించుకుని మోసం చేశాడని చెన్నైకి చెందిన ఓ యువతి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుకు ఫిర్యాదు చేసింది. నిశాంత్ అనే యువకుడు మాట్లాడిన ఫోన్ నెంబర్ కూడా ఆమె పోలీసులకు ఇచ్చింది.

 కేటుగాడికి మారుపేర్లు

కేటుగాడికి మారుపేర్లు

పోలీసుల విచారణలో నిశాంత్ పేరుతో యువతితో ఇంతకాలం మాట్లాడి మోసం చేసింది నిశాంత్ కాదని, తమిళనాడులోని తిరుమలైవాయిల్ లో నివాసం ఉంటున్న లోకేష్ (26) అని పోలీసులు గుర్తించారు. లోకేష్ ను అదుపులోకి తీసుకున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతన్ని విచారణ చేసి వివరాలు బయటకులాగారు. పోలీసుల విచారణలో లోకేష్ దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు చెప్పాడని పోలీసులు అన్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

 ఇంజనీరింగ్ చదువుకు నామం

ఇంజనీరింగ్ చదువుకు నామం

ఇంజనీరింగ్ చదువుకు మద్యలోనే నామం పెట్టిన లోకేష్ అతని కుటుంబ సభ్యులు ఇస్తున్న డబ్బులు చేతి ఖర్చులకు సరిపోవడం లేదని, ఎలాగైనా ఉద్దరగా డబ్బులు సంపాదించాలని ఆలోచించాడు. ఎక్కువగా సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న లోకేష్ కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళలను టార్గెట్ చేసుకున్నాడు.

 ఫేస్ బుక్ లో వేరే యువకుల ఫోటోలు

ఫేస్ బుక్ లో వేరే యువకుల ఫోటోలు

ఫేస్ బుక్ లో అందంగా ఉన్న ఇద్దరు వేరే అబ్బాయిల ఫోటోలు పెట్టిన లోకేష్ నిశాంత్ అనే పేరుతో కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళలను పరిచయం చేసుకున్నాడు. తరువాత ప్రేమ పేరుతో అమ్మాయిలను, వ్యామోహంతో ఉన్న వివాహిత మహిళలతో ఆన్ లైన్ డేటింగ్ చేస్తున్నట్లు నటించిన లోకేష్ వారితో చనువుగా మాట్లాడాడు.

 వాట్సాప్ లో చాటింగ్, బెడ్ రూమ్ వీడియో కాల్స్

వాట్సాప్ లో చాటింగ్, బెడ్ రూమ్ వీడియో కాల్స్

ఫేస్ బుక్ లో పరిచయం అయిన వారితో తరువాత లోకేష్ ఫోన్ లో మాట్లాడుతూ వారికి సెక్స్ జోకులు వేసి వారికి పిచ్చి ఎక్కిపోయే బూతులు మాట్లాడాడు. ఇలా కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళలతో వాట్సాప్ చాటింగ్ చేస్తూ, నగ్నంగా వారితో వీడియో కాల్స్ చేస్తూ బూతులు మాట్లాడాడు. ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని తరువాత వారిని బ్లాక్ మెయిల్ చేసి వారి దగ్గర ఇప్పటి వరకు 13 తులాల బంగారంతో పాటు, గూగుల్ పే ద్వారా లక్షలాది రూపాయలు లాక్కొన్నాడు.

Recommended Video

    గజ్వేల్ సభను విజయవంతం చేసి తీరుతామన్న మధు యాష్కీ గౌడ్
     కనపడకుండా దోచుకున్నాడు

    కనపడకుండా దోచుకున్నాడు

    లోకేష్ ఇంత వరకు ఒక్కరికి కూడా కనపడకుండా కోరియర్ లోనే బంగారు నగలు తెప్పించుకున్నాడని వెలుగు చూడటం కలకలం రేపింది. చెన్నై, కోయంబత్తూరు, కన్యాకుమారి, దిండిగల్, మదురై, తిరుచ్చి, పుదుచ్చేరిలో నివాసం ఉంటున్న కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళలను లోకేష్ మాయం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కేటుగాడు లోకేష్ బాధితుల జాబితాలో 15 మందికి పైగా కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళలు ఉన్నారని తెలుసుకున్న చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బిత్తరపోయారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+