• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Cheating: బ్యాంక్ లో బ్యాడ్ టైమ్, అంకుల్, కిలాడీ రొమాన్స్,పెళ్లి, నాకించేసి రూ. కోట్లు స్వాహా !

|

ముంబాయి/చెన్నై: వ్యాపారవేత్తకు ఓ బ్యాంక్ లో బ్యాడ్ టైమ్ స్టాట్ అయ్యింది. వ్యాపారవేత్త దగ్గర భారీ మొత్తంలో డబ్బులు ఉందని గమనించిన కిలాడి అతన్ని వలలో వేసుకోవాలని స్కెచ్ వేసింది. అంకుల్ మీరు సూపర్ అంటూ అతనికి దగ్గర అయ్యింది. తనకు వయసు అయిపోతుందని, చివరి వరకు జీవితాంతం తనకు తోడుగా ఉంటుందని ఆ వ్యాపారవేత్త అనుకున్నాడు. రిసార్ట్ లు, స్టార్ హోటల్స్, విహారయాత్రలకు వెళ్లిన ఇద్దరు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. మస్త్ మజా చేస్తున్న అమ్మాయి మాయమాటలు నమ్మిన అంకుల్ ఆమెకు కొన్ని కోట్ట రూపాయలు ఇచ్చాడు. ముచ్చటగా మూడు కోట్లకు పైగా లాక్కొన్న కిలాడీ అంకుల్ కు హైవే రోడ్డు చూపించి అతని జీవితం నిలువునా ముంచేసి అతన్ని సంకనాకించేసింది.

రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?

Romance: ఎమ్మెల్యే టిక్కెట్, నైటీబ్యూటీ రాసలీలల సీడీ, బెడ్ రూమ్ దెబ్బ, డాక్టర్ పేరులోనే కాము !Romance: ఎమ్మెల్యే టిక్కెట్, నైటీబ్యూటీ రాసలీలల సీడీ, బెడ్ రూమ్ దెబ్బ, డాక్టర్ పేరులోనే కాము !

 కోటీశ్వరుడు.... వ్యాపారవేత్త

కోటీశ్వరుడు.... వ్యాపారవేత్త

ముంబాయిలోని మల్వానీ ప్రాంతంలో గెరాన్ డిసౌజా అనే వ్యాపారవేత్త నివాసం ఉంటున్నాడు. గెరాన్ డిసౌజా పెద్ద వ్యాపారవేత్త. ముంబాయి విమానాశ్రయం సమీపంలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో గెరాన్ డిసౌజా తండ్రి చాలా ఏళ్ల క్రితం భూమిని కొనుగోలు చేశాడు. విమానాశ్రయం సమీపంలో తండ్రి కొనుగోలు చేసిన భూమిని డిసౌజా 2010లో విక్రయించాడు.

 కోట్ల రూపాయలతో వ్యాపారం

కోట్ల రూపాయలతో వ్యాపారం

తండ్రి ఆస్తిని విక్రయించిన డిసౌజ వచ్చిన కోట్ల రూపాయలను నాలుగు ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టాడు. మిగిలిన డబ్బులు ప్రముఖ ఆర్థిక సంస్థలో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాడు. కోట్ల రూపాయలు సంపాధిస్తున్న డిసౌజా బాగానే ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. అయితే డిసౌజా జీవితంలో అనుకొని సంఘటన ఎదురైయ్యింది.

 బ్యాంక్ లో బ్యాడ్ టైమ్ మొదలైయ్యింది

బ్యాంక్ లో బ్యాడ్ టైమ్ మొదలైయ్యింది

గత ఏడాది ముంబాయిలోని ఓ బ్యాంక్ లో డిసౌజాకు షాలిని సింగ్ అనే యువతి పరిచయం అయ్యింది. ఆ రోజుతనకు బ్యాడ్ టైమ్ ఎదురైయ్యిందని డిసౌజా అసలు ఊహించలేకపోయాడు. షాలిని సింగ్, డిసౌజా పరిచయం కాస్త చనువుగా మారింది. అప్పటి నుంచి ఒకరిని ఒకరు కలుస్తూ వచ్చారు.

 అంకుల్ బిగ్ షాట్

అంకుల్ బిగ్ షాట్

వ్యాపారవేత్త డిసౌజా, షాలిని సింగ్ వయసులో చాలా తేడా ఉంది. డిసౌజా బిగ్ షాట్ అని పసిగట్టిన షాలిని సింగ్ డిసౌజాకు దగ్గర కావడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి వీకెండ్ లో పార్టీలు, పబ్ లు, రిసార్టులు, స్టార్ హోటల్స్ కు వెళ్లిన డిసౌజా, షాలిని సింగ్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. డిసౌజాకు స్వర్గం చూపించిన షాలిని అతన్ని పూర్తిగా ఆమె వలలో వేసుకుంది.

 పెళ్లి పేరుతో రూ. కోట్లు స్వాహా

పెళ్లి పేరుతో రూ. కోట్లు స్వాహా

నిన్ను పెళ్లి చేసుకుంటానని, జీవితాంతం నీకు తోడుగా ఉంటానని షాలిని సింగ్ అంకుల్ డిసౌజాకు మాయమాటలు చెప్పింది. తాను వ్యాపారం చెయ్యాలనుకుంటున్నానని, వచ్చిన లాభంలో ఇద్దరూ 50-50 తీసుకుందామని షాలిని సింగ్ ప్రియుడు డిసౌజాకు చెప్పింది. తన వయసు తేడా చూడకుండా తనను పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన షాలిని సింగ్ మాయమాటలు నమ్మిన డిసౌజా కొన్ని కోట్ల రూపాయలు ఆమెకు ఇచ్చేశాడు.

 ఏడు కొండలవాడా.... గోవిందా..... గోవింద

ఏడు కొండలవాడా.... గోవిందా..... గోవింద

అంకుల్ డిసౌజా దగ్గర రూ. 3. 30 కోట్లు లాక్కొన్న షాలిని సింగ్ రానురాను అతనికి దూరం కావడం మొదలుపెట్టింది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ ? అంటూ డిసౌజా ప్రశ్నిస్తే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం మొదలుపెట్టింది. చివరికి అంకుల్ ఫోన్ నెంబర్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పూర్తిగా బ్లాక్ చేసిన షాలిని సింగ్ అతన్ని నిలువునా ముంచేసి చేతులు ఎత్తేసింది.

సార్..... మీరే కాపాడండి..... జరిగిన స్టోరీ ఇదే

సార్..... మీరే కాపాడండి..... జరిగిన స్టోరీ ఇదే

షాలిని సింగ్ నిలువునా మోసం చేసిందని ఆలస్యంగా తెలుసుకున్న అంకుల్ డిసౌజా మోసం జరిగిందని ముంబాయిలోని అంథేరి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. మేడమ్ షాలిని సింగ్ మొబైల్ ఫోన్లు రెండు స్వీచ్ ఆఫ్ రావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. అంకుల్ డిసౌజా దగ్గర ఉన్న షాలిని సింగ్ ఫోటోల ఆధారంగా అంథేరి పోలీసులు కిలాడీ లేడీ కోసం గాలిస్తున్నారు.

English summary
Cheating: A young woman has become intimately acquainted with an old man who wants to marry her and has cheated him of Rs 3.3 crore. Mumbai police have registered a case and are investigating the complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X