Cheating: మ్యాట్రీమోనీలో మహిళలు టార్గెట్, నకిలీ మిలటరి అధికారి అందర్, కారులోనే అన్నీ !
బెంగళూరు/పూణే/బెళగావి: మ్యాట్రిమోనీలో అమ్మాయిలు, మహిళలను పరిచయం చేసుకుంటున్న యువకుడు వారికి మాయమాటలు చెప్పి ముగ్గులోకి దింపుతున్నాడు. తాను మిలటరీలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నానని, వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నానని అమ్మాయిలకు గాలం వేశాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని మోసపోయిన కొందరు మహిళలు అతని మాయలో పడిపోయారు. వివాహం చేసుకుంటానని నమ్మించి వారికి ఇంకా ఎక్కువ మాయమాటలు చెప్పి వారితో కామం తీర్చుకుంటున్నాడు. వివాహం చేసుకోవాలని బాధితులు ఎక్కువ ఒత్తిడి చేస్తే వారి మొబైల్ నెంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టి తప్పించుకుని తిరుగుతున్నాడు. నకిలి మిలటరీ అధికారి ముసుగులో ఈ కేటుగాడు ఇప్పటికే కొందరికి కుచ్చుటోపి పెట్టాడని తెలిసింది. అయితే ఓ యువతిని ఇలాగే మోసం చేసి కారులోనే కామం తీర్చుకుని ఆమెను కూడా మోసం చెయ్యడానికి ప్రయత్నించిన నకిలి మిలటరీ అధికారి పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు.

మాయలోడు
కర్ణాటకలోని బెళగావిలోని కుంపెటగిరిలో ప్రశాంత్ భవరావ్ పాటిల్ అలియాస్ ప్రశాంత్ పాటిల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మ్యాట్రిమోనీలో అమ్మాయిలు, మహిళలను పరిచయం చేసుకుంటున్న ప్రశాంత్ పాటిల్ వారిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ముగ్గులోకి దింపుతున్నాడు.

మిలటరీ అధికారి అని నమ్మించాడు
మ్యాటరిమోనీలో పరిచయం అయిన మహిళలను ప్రశాంత్ పాటిల్ టార్గెట్ చేసుకున్నాడు. నేను మిలటరీలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నానని, వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నానని ప్రశాంత్ పాటిల్ అనేక మంది అమ్మాయిలకు గాలం వేశాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని మోసపోయిన కొందరు మహిళలు ప్రశాంత్ పాటిల్ మాయలో పడిపోయారు.

కుచ్చుటోపి పెట్టాడు
వివాహం చేసుకుంటానని నమ్మించిన ప్రశాంత్ పాటిల్ వారిని ఇంకా ఎక్కువ మాయమాటలు చెప్పి వారితో కామం తీర్చుకుంటున్నాడు. వివాహం చేసుకోవాలని బాధితులు ఎక్కువ ఒత్తిడి చేస్తే వారి మొబైల్ నెంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టి తప్పించుకుని తిరుగుతున్నాడు. నకిలి మిలటరీ అధికారి ముసుగులో కేటుగాడు ప్రశాంత్ పాటిల్ ఇప్పటికే కొందరికి కుచ్చుటోపి పెట్టాడని వెలుగు చూసింది.

పూణే అమ్మాయి దెబ్బతో మైండ్ బ్లాక్
పూణేలో నివాసం ఉంటున్న యువతిని ఇలాగే మోసం చేసిప ప్రశాంత్ పాటిల్ ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఓ వినాయకుడి గుడి దగ్గర ఇలాగే ఆమెను నమ్మించి పిలుచుకుని వెళ్లాడు. తరువాత కారులోనే కామం తీర్చుకున్న ప్రశాంత్ పాటిల్ ఆమెను కూడా మోసం చెయ్యడానికి ప్రయత్నించాడు. అయితే పూణే అమ్మాయి గురించి అతనను పూర్తిగా తెలుసుకోలేకపోయాడు.
Recommended Video

2018 నుంచి అలవాటు అయిపోయింది
పూణే యువతి కేసు పెట్టడంతో పోలీసులు నకిలి మిలటరీ అధికారి ప్రశాంత్ పాటిల్ ను అరెస్టు చేశారు. 2018లో ఇలాగే ప్రశాంత్ పాటిల్ పోలీసు అధికారులు అంటున్నారు. పూణే, లాతూర్, అహమ్మద్ నగర్ తదితర నగరాల్లో ప్రశాంత్ పాటిల్ మీద 2018 నుంచి ఇప్పటి వరకు అనేక కేసులు నమోదు అయ్యాయని పోలీసు అధికారులు అంటున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications