Cheating: కత్తిలా ఉందని ఎదురుకట్నం, పెళ్లికూతురు తో పాటు ఆమె చిన్నమ్మ?, పెళ్లి కొడుకు!

లక్నో/చెన్నై: పెళ్లి చేసుకోవాలని ఉబలాటపడుతున్న ఓ యువకుడికి సినిమా కనపడింది. పిల్ల కత్తిలా ఉందని ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు. గుడిలో పెళ్లికి సర్వం సిద్దం చేశారు. పెళ్లి కూతురు, ఆమె తల్లిదండ్రులు, చిన్నమ్మ కూడా వచ్చేశారు. పెళ్లి పంతులు మంత్రాలు చదువుతున్నాడు. ఏడు అడుగులు వెయ్యడానికి పెళ్లి కొడుకు సిద్దం అయ్యాడు. ఇంతలో పెళ్లి కూతురు వాష్ రూమ్ కు వెళ్లింది. కొంత సేపటికి పెళ్లి కూతురు చిన్నమ్మ అక్కడి నుంచి వెళ్లింది. పెళ్లి కుమార్తెతో పాటు ఆమె వెంట వచ్చిన వాళ్లు, చివరికి పెళ్లి పంతులు కూడా పెళ్లి కొడుక్కి చిత్రాన్నం తినిపించడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

పెళ్లి చేసుకుని ఎంజాయ్ చెయ్యాలి

పెళ్లి చేసుకుని ఎంజాయ్ చెయ్యాలి

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని ముజఫర్ నగర్ సమీపంలోని మోహమ్మదూర్ గని ప్రాంతంలో దేవేంద్ర అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన దేవేంద్ర చాలా చోట్ల పెళ్లి సంబంధాలు చూశాడు. ఒకేసారి పెళ్లి చేసుకుంటామని, జీవితాంతం ఆమెతో కలిసి ఉండాలని, అందుకే ఆలస్యం అయినా సూపర్ ఫిగర్ ను పెళ్లి చేసుకోవాలని దేవేంద్ర అమ్మాయి కోసం వెతుకుతున్నాడు.

 అమ్మాయి సూపర్ ఫిగర్

అమ్మాయి సూపర్ ఫిగర్

దేవేంద్రకు ప్రదీప్ అనే స్నేహితుడు ఉన్నాడు. ప్రదీప్ ద్వారా దేవేంద్రకు ఓ అమ్మాయి తల్లిదండ్రులు పరిచయం అయ్యారు. మా అమ్మాయిని నువ్వు చూడాలని, నీకు నచ్చితే పెళ్లి చేసుకోవాలని దేవేంద్రకు చెప్పారు. దేవేంద్ర వెళ్లి చూడగా నిజంగానే ఆ అమ్మాయి ఎర్రగా, సన్నగా సూపర్ గా ఉందని తెలిసింది.

కత్తిలా ఉందని ఎదురుకట్నం

కత్తిలా ఉందని ఎదురుకట్నం

దేవేంద్రకు ఆ అమ్మాయి పిచ్చపిచ్చగా నచ్చేసింది. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని దేవేంద్ర డిసైడ్ అయ్యాడు. అయితే తాము ఇప్పుడే పెళ్లి చెయ్యలేమని, మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని అమ్మాయి తల్లిదండ్రులు చివరి నిమిషయంలో సినిమా స్టోరీ చెప్పారు. అమ్మాయి కత్తిలాగా ఉండటంతో ఎక్కడ ఆమె తనకు దక్కకుండా పోతుందో అనే భయంతో పెళ్లి ఖర్చులకు లక్ష రూపాయలు, అమ్మాయికి బంగారు నగలు ఎదురు కట్నంగా ఇవ్వడానికి దేవేంద్ర, అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు.

 పెళ్లికి సర్వం సిద్దం

పెళ్లికి సర్వం సిద్దం


పార్నాపుర సమీపంలోని భూరో గ్రామంలోని శివుడి గుడిలో పెళ్లికి సర్వం సిద్దం చేశారు. పెళ్లి కూతురు, ఆమె తల్లిదండ్రులు, చిన్నమ్మ కూడా గిడి దగ్గరకు వచ్చేశారు. పెళ్లి కొడుకు దేవేంద్ర ఇచ్చినమాట ప్రకారం పెళ్లి పీటల మీద పెళ్లి కూతురికి రూ. లక్ష రూపాయలు ఇచ్చాడు. అంతకు ముందే పెళ్లి కూతురిని బంగారు నగలు తీసిచ్చారు. పంతులు మంత్రాలు చదువుతున్నాడు. ఏడు అడుగులు వెయ్యడానికి పెళ్లి కొడుకు దేవేంద్ర సిద్దం అయ్యాడు. ఇంతలో పెళ్లి కూతురు తాను వాష్ రూమ్ కు వెళ్లాలని నటకాలు ఆడింది.

 చూసి వస్తానని చిన్నమ్మ కూడా

చూసి వస్తానని చిన్నమ్మ కూడా


వాష్ రూమ్ కి వెళ్లిన పెళ్లి కూతురు ఎంతసేపటికి రాకపోవడంతో పెళ్లి కొడుకు దేవేంద్రకు టెన్షన్ మొదలైయ్యింది. ఇంతలో పెళ్లి కూతురు ఇంకా ఎందుకు రాలేదో నేను వెళ్లి చూసి వస్తానని ఆమె చిన్నమ్మ అక్కడి నుంచి చిన్నగా జారుకునింది. పెళ్లి కూతురు, ఆమె చిన్నమ్మ ఇద్దరూ రాకపోవడంతో పెళ్లి కొడుకు దేవేంద్ర, అతని కుటుంబ సభ్యులు సమీపంలోని వాష్ రూమ్ దగ్గరకు వెళ్లారు.

 అందరూ నకిలీనే, డబ్బులు, బంగారు మాత్రం ఒరిజినల్

అందరూ నకిలీనే, డబ్బులు, బంగారు మాత్రం ఒరిజినల్

పెళ్లి కూతురి కోసం పెళ్లి కొడుకు వెతుక్కుంటూ వెళ్లిన టైమ్ లో అక్కడ ఉన్న పెళ్లి కూతురు బంధువులు, చివరికి పంతులు కూడా అక్కడి నుంచి జంప్ అయిపోయారు. పెళ్లి కూతురు, ఆమె బంధువులు, చివరికి పెళ్లి పంతులు కూడా నకిలీ అని తెలుసుకున్న దేవేంద్ర పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లి కూతురికి నేను ఇచ్చిన రూ. 1 లక్షరూపాయలు, బంగారు నగలు ఇప్పించాలని పెళ్లి కొడుకు దేవేంద్ర పోలీసులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నవ్వుకుని దేవేంద్ర మీద జాలిపడి కిలాడీ లేడీ ఫ్యామిలీ కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+