Cheating: లేడీ టెక్కీకి జ్యూస్ లో మత్తుమందు ఇచ్చిన ఆంటీ, పెంపుడు కొడుకు ఎంజాయ్ చేస్తుంటే !
చెన్నై: సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి తమ్ముడు డ్యాన్స్ స్కూల్ లో చేరాడు. తమ్ముడి కోసం వెళ్లి వస్తున్న యువతికి డ్యాన్స్ మాస్టర్ పరిచయం అయ్యాడు. కొంతకాలానికి డ్యాన్స్ మాస్టర్, లేడీ టెక్కీ ప్రేమించుకున్నారు. డ్యాన్స్ మాస్టర్ పెంపుడు తల్లి లేడీ టెక్కీని ఆమె ఇంటికి పిలుచుకుని వెళ్లి జ్యూస్ లో మత్తుమందు కలిపి ఆ అమ్మాయికి ఇచ్చింది. ఆ సమయంలో లేడీ టెక్కీ మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా ఆ డ్యాన్స్ మాస్టర్ అతని మొబైల్ ఫోన్ లో ఆ సీన్ లు మొత్తం వీడియో తీసి సీక్రేట్ గా దాచిపెట్టుకున్నాడు. తరువాతపెళ్లి కాకుండానే డ్యాన్స్ మాస్టర్, లేడీ టెక్కీశారీరక సంబంధం పెట్టుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన లేడీ టెక్కీ దగ్గర రిజిస్టర్ మ్యారేజ్ కోసం రూ. ఒక లక్ష తీసుకున్న డ్యాన్స్ మాస్టర్ చివరికి గుడిలో పెంపుడు తల్లి సమక్షంలో ఆమె మెడలో తాళి కట్టాడు. ఇద్దరూ ఎవరి ఇళ్లల్లోవాళ్లు ఉంటూ శారీరకంగా కలుస్తున్నారు. లేడీ టెక్కీ గర్బవతి అయ్యింది. నిన్ను మా ఇంటికి కోడలిగా పిలుచుకోవాలంటే నేను అడిన బంగారు నగలు, కట్నం తీసుకురావాలని డ్యాన్స్ మాస్టర్ పెంపుడు తల్లి డిమాండ్ చేసింది. మా అమ్మ చెప్పినట్లు నువ్వు వినాలని, లేదంటే నీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని డ్యాన్స్ మాస్టర్ ప్రేమించిన లేడీ టెక్కీని బ్లాక్ మెయిల్ చెయ్యడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.
Wife:
ఆర్మీ
మొగుడు
అని
మొదట్లో
హ్యాపీ,
క్లైమాక్స్
లో
భర్తను
వెంటాడి
వెంటాడి
చంపేసిన
భార్య
!

డ్యాన్స్ మాస్టర్ తో టచ్ లోకి వచ్చిన లేడీ టెక్కి
చెన్నైలోని మాడంబాక్కం ఏరియాలో 28 ఏళ్ల వయసు ఉన్నన వినోదా ( పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. చెనైలోనే ప్రభు అనే డ్యాన్స్ మాస్టర్ ఉంటున్నాడు. చెన్నైలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వినోదా తమ్ముడు 2019లో ప్రభు నిర్వహిస్తున్న డ్యాన్స్ స్కూల్ లో చేరాడు.

డ్యాన్స్ మాస్టర్ మాయలో పడిన లేడీ టెక్కి
తమ్ముడి కోసం వెళ్లి వస్తున్న లేడీ టెక్కి వినోదాకు డ్యాన్స్ మాస్టర్ ప్రభు పరిచయం అయ్యాడు. కొంతకాలానికి డ్యాన్స్ మాస్టర్ ప్రభు, లేడీ టెక్కీ వినోదా ప్రేమించుకున్నారు. అప్పటి నుంచి డ్యాన్స్ స్కూల్ దగ్గరకు వెళ్లి వస్తున్న వినోదా డ్యాన్స్ మాస్టర్ ప్రభు మాయలో పడిపోయి అతనికి దగ్గర అయ్యింది.

లేడీ టెక్కీకి జ్యూస్ మత్తుమందు ఇచ్చిన డ్యాన్స్ మాస్టర్ పెంపుడు తల్లి
డ్యాన్స్ మాస్టర్ ప్రభుకు రేవతి అనే పెంపుడు తల్లి ఉంది. ప్రభు పెంపుడు తల్లి రేవతికి లేడీ టెక్కీ వినోదా పరిచయం అయ్యింది. 2019 డిసెంబర్ నెలలో రేవతి ఆమె విలాసవంతమైన కారులో లేడీ టెక్కి వినోదాను పిలుచుకుని చెన్నైలోని గుమ్మడిపూండి సమీపంలోని ఆమె ఇంటికి పిలుచుకుని వెళ్లింది. తరువాత రేవతి ఆమె ఇంట్లో జ్యూస్ లో మత్తుమందు కలిపి ఇంటికి వచ్చిన లేడీ టెక్కి వినోదాకు ఇవ్వడంతో ఆమె నిద్రలోకి జారుకుంది.

పెంపుడు కొడుకు ఎంజాయ్ చేస్తుంటే ?
పెంపుడు తల్లి రేవతి ఇంటికి వెళ్లిన డ్యాన్స్ మాస్టర్ నిద్రమత్తులో ఉన్న ప్రియురాలు వినోదాను నగ్నంగా చేసి ఆమె మీద అత్యాచారం చేశాడు. ప్రియురాలి వినోదా మీద అత్యాచారం చేసే సమయంలో ప్రభు అతని మొబైల్ ఫోన్ లో వీడియోలు, ఫోటోలు తీసి సీక్రేట్ గా దాచిపెట్టుకున్నాడు. పెంపుడు కొడుకు లేడీ టెక్కీ వినోదా మీద అత్యాచారం చేసి వీడియోలు తీస్తున్న సమయంలో రేవతి అదే ఇంట్లో ఉందని సమాచారం.

రిజిస్టర్ మ్యారేజ్ కోసం రూ. 1 లక్ష డిమాండ్
తన మీద అత్యాచారం జరిగిందని తెలుసుకున్న లేడీ టెక్కి వినోదా తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు ప్రభు మీద ఒత్తిడి చేసింది. రిజిస్టర్ మ్యారేజ్ కు రూ. 1 లక్ష వరకు ఖర్చు అవుతుందని ప్రియుడు ప్రభు, అతని పెంపుడు తల్లి రేవతి ప్రియురాలు వినోదాకు చెప్పారు. వినోదా రూ. 80,000 గూగుల్ పే ద్వారా ప్రియుడు ప్రభుకు డబ్బులు పంపించింది.

డ్రామాలు ఆడి గుడిలో తాళి కట్టిన ప్రియుడు
రిజిస్టర్ ఆఫీసు దగ్గరకు వినోదాను పిలిపించుకున్న ప్రభు అక్కడ డ్రామాలు ఆడి లాయర్లు ఎవ్వరూ చిక్కలేదని చెప్పాడు. చివరికి రిజిస్టర్ ఆఫీసు సమీపంలోని గుడిలోకి ప్రియురాలు వినోదాను పిలుచుకుని వెళ్లిన ప్రభు అక్కడికి పెంపుడు తల్లి రేవతిని పిలిపించి ఆమె సమక్షంలో ప్రియురాలి మెడలో తాళి కట్టి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నించాడు.

కట్నం డిమాండ్ చేసిన ఆంటీ
గుడిలో పెళ్లి జరిగిపోయిన తరువాత ప్రభు, వినోదా ఎవరి ఇళ్లల్లోవాళ్లు ఉంటూ శారీరకంగా కలుస్తున్నారు. ఇటీవల లేడీ టెక్కీ వినోదా గర్బవతి అయ్యింది. నన్ను మీ ఇంటికి పిలుచుకుని వెళ్లాలని వినోదా ఆమె ప్రియుడు ప్రభు మీద ఎక్కువ ఒత్తిడి చేసింది. నిన్ను మా ఇంటికి కోడలిగా పిలుచుకోవాలంటే నేను అడిన బంగారు నగలు, కట్నం తీసుకురావాలని, లేదంటే నీ దారి నువ్వు చూసుకోవాలని డ్యాన్స్ మాస్టర్ ప్రభు పెంపుడు తల్లి రేవతి ఎదురుతిరిగింది.

బ్లాక్ మెయిల్ చేసిన ప్రియుడు అరెస్టు
మా పెంపుడు తల్లి రేవతి చెప్పినట్లు నువ్వు వినాలని, లేదంటే నీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని డ్యాన్స్ మాస్టర్ ప్రభు అతను ప్రేమించిన లేడీ టెక్కీ వినోదాను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు. విసిగిపోయిన వినోదా గుమ్మిడిపూండి మహిళా పోలీస్ స్టేషన్ లో డ్యాన్స్ మాస్టర్ ప్రభు, అతని పెంపుడు తల్లి రేవతి మీద కేసు పెట్టింది. పోలీసులు డ్యాన్స్ మాస్టర్ ప్రభును అరెస్టు చేసి జైలుకు పంపించారు.

పెంపుడు తల్లికి 70 ఎంఎం సినిమా
ప్రభు పెంపుడు తల్లి రేవతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రభు, అతని పెంపుడు తల్లి రేవతి తనకు చేసినట్లే ఇంకా చాలా మంది అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడి ఉంటారని వినోదా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు డ్యాన్స్ మాస్టర్ ప్రభు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.