Cheating love: నువ్వులేక‘నేనులేను’: కొవ్వుపట్టి కడుపు చేసుకున్నావ్, ఆత్మహత్యతో డీఐజీ హడల్ !
చెన్నై: 10వ తరగతి పాస్ అయిన అమ్మాయి హ్యాపీగా ఇంట్లో తల్లిదండ్రులు, అక్కలతో కలిసి హ్యాపీగా ఉంటోంది. ఇదే సమయంలో సమీప బంధువు అయిన యువకుడు ఆమెను వలలో వేసుకుని నువ్వులేకనేనులేను అంటూ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి హద్దులుమీరి ఆమెను గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ఆ యువకుడు నీకు ధిక్కున్నచోట చెప్పుకో అని ఎదురు తిరిగాడు. తల్లిని చేసి మోసం చేసిన యువకుడికి డబ్బు, పలుకుబడి ఉండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కామంతో రెచ్చిపోయి కొవ్వుపట్టి కడుపు చేసుకున్నావ్, ముందు వెనుకా ఆలోచించకుండా జల్సా చేసి ఇప్పుడు కేసు పెట్టడానికి వచ్చావా ? అంటూ పోలీసులు యువతిదే తప్పు అని నీచంగా మాటడటంతో ఆవేదన చెందిన ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేపింది.

హ్యాపీలైఫ్ లోకి రామరాంకీ ఎంట్రీ
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలోని పట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్న కార్మికుడికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. కార్మికుడి నాలుగవ కుమార్తె (17) 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్ చదవడానికి సిద్దం అయ్యింది. ముగ్గురు అక్కలతో, తల్లిదండ్రులతో కలిసి ఆ యువతి సంతోషంగా ఉంటున్నది. ఇదే సమయంలో యువతి సమీప బంధువు రామరాంకీ (22) అనే యువకుడు ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

మనసంతానువ్వే.... నువ్వులేక నేనులేను !
యువతికి సమీప బంధువు అయిన రామరాంకీ ఆమెతో చనువుగా ఉంటున్నాడు. నవ్వంటేనాకిష్టం, మనసంతానువ్వే, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా... అంటూ సినిమా డైలాగ్ లు చెప్పాడు. యువతిని గత ఏడాది నుంచి ప్రేమిస్తున్న రామరాంకీ ఆమెతో చాలా చనువుగా ఉన్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆమె ఒంటరిగా ఉంటున్న సమయంలో రామరాంకీ కలుసుకున్నాడు.

పెళ్లి పేరుతో హద్దులు మీరిపోయారు
పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రామరాంకీ హద్దలు మీరిపోయి యువతితో శారీరకంగా కలవడం మొదలు పెట్టాడు. అంతే గత 8 నెలల నుంచి ఇద్దరూ శారీరకంగా కలుస్తున్నారు. యువతి మూడు నెలల క్రితం గర్బవతి అని తెలుసుకుని తనను పెళ్లి చేసుకోవాలని, ఇంట్లో సమాధానం చెప్పలేకపోతున్నానని ప్రియుడు రామరాంకీకి చెప్పింది.

గర్భవతితో పెళ్లి ఏందిరా ముఠాల్
యువతి గర్బవతి అనే విషయం రామరాంకీ తల్లిదండ్రులకు, బంధువులకు తెలిసిపోయింది. గర్బవతితో పెళ్లి ఎందిరా ముఠాల్ అని బంధువులు, తల్లిదండ్రులు రామరాంకీ మీద మండిపడ్డారు. పెళ్లి చేసుకోవాలని బంధువుల అమ్మాయి ఎక్కువ ఒత్తిడి చెయ్యడంతో రామరాంకీ ఎదురుతిరిగాడు. తనకు ఆ గర్బానికి ఎలాంటి సంబంధం లేదని, తాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనని రామరాంకీ ఎదురుతిరిగాడు.

పోక్సో కేసు పెట్టినా జల్సాగా ఎంజాయ్
మోసం చేసిన ప్రియుడు రామరాంకీ మీద యువతి మనప్పారై మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రామరాంకీ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రామరాంకీకి డబ్బు బలం, రాజకీయ అండ ఉండటంతో అతని మీద పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా రామరాంకీకి మద్దతుగా పోలీసులు మాట్లాడటం మొదలుపెట్టారు. పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రామరాంకీ మాత్రం దర్జాగా తిరుగుతూ ఎంజాయ్ చేశాడు. ఇదే సమయంలో యువతి మానసికంగా కుంగిపోయింది.

యువతి ధర్నా..... ప్రియుడికి బెయిల్
రామరాంకీ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఆమె మనప్పారై మహిళా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసింది. ఆ సమయంలో రామరాంకీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆ యువతికి నచ్చచెప్పి ధర్నా విరమింపచేసి ఇంటికి పంపించారు. రెండు రోజుల తరువాత రామరాంకీ కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకుని పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకుని ఇంకోసారి పోలీసులు, కేసు అంటూ తిరిగితే నిన్ను లేపేస్తా ? అంటూ ఆమెను బెదిరించాడు.

కొవ్వుపట్టి పడుకున్నావ్ ? ఆత్మహత్య !
రామరాంకీ బెయిల్ తీసుకున్నాడని తెలుసుకున్న బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు మనప్పారై పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. నీకు కొవ్వపట్టి వాడి పక్కలో పడుకుని కడుపు చేయించుకున్నావ్, దానికి మేమేం చెయ్యాలి ? అంటూ మహిళా పోలీసులు యువతిని అసభ్యంగా అందరి ముందు దూషించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రేమించిన రామరాంకీ మోసం చెయ్యడం, న్యాయం చెయ్యాల్సిన పోలీసులు దూషించడంతో ఆవేదన చెందిన యువతి నేరుగా ఇంటికి వెళ్లి పొలానికి ఉపయోగించే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది.

హడలిపోయిన ఐజీ, డీఐజీ
యువతి ఆత్మహత్య చేసుకోవడంతో మొద్దునిద్ర లేచిన మనప్పారై పోలీసులు చివరికి రామరాంకీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తమిళనాడులో యువతి ఆత్మహత్య కలకలం రేపడంతో స్వయంగా ఐజీ జయరామన్, డీఐజీ అణి విజయ, ఎస్పీ జియా ఉల్ హక్ మనప్పారై పోలీస్ స్టేషన్ చేరుకుని వారే స్వయంగా వారే విచారణ చేస్తున్నారు. యువతి ఆత్మహత్యకు కారణం అయిన మనప్పారై మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications