Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cheating: ఫేమస్ యూట్యూబర్, కాలేజ్ గర్ల్ కు మోసం, ఆంటీలు, అమ్మాయిలతో సంబంధం, నరాలు !

చెన్నై/ తిరుచ్చి: ప్రాంక్ వీడియోలతో ఫేమస్ అయిన యువకుడు పీజీ చదువుతున్న అయుతితో పరిచయం పెంచుకున్నాడు. వెరైటీ వెరైటీగా ప్రాంక్ వీడియోలు తీస్తూ ఎప్పటికప్పుడు యూట్యూబ్ చానల్ లో పోస్టు చేస్తున్న యువకుడికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారని సమాచారం. ఇదే సమయంలో ముందుగా పరిచయం అయిన అందమైన పీజీ యువతిని యూట్యూబర్ లైన్ లో పెట్టాడు. ఎర్రగా, సన్నగా పొడవుగా ఉన్న పీజీ అమ్మాయికి మాయమాటలు చెప్పిన యూట్యూబర్ ఆమెను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. ప్రేమికులు కొంతకాలం చాలా సంతోషంగా కాలం గడిపారని తెలిసింది. అయితే రానురాను తన ప్రియుడు యూట్యూబర్ చాలా మంది అమ్మాయిలను వలలో వేసుకుని జల్సా చేస్తున్నాడని పీజీ చదువుతున్న యువతికి తెలిసింది. ఈ విషయం తేల్చుకుందామని సొంత ఊరి నుంచి ప్రియుడు ఉన్న సిటీకి వెళ్లిన ప్రియురాలు అతన్ని నిలదీసింది. ప్రియురాలి ముందు నీళ్లు నమిలిన ప్రియుడు తరువాత అక్కడ ఆమెతో గొడవ పెట్టుకుని వెళ్లిపోయాడు. నేరుగా ఇంటికి వెళ్లిన ప్రియులు జరిగిన స్టోరీ మొత్తం డెత్ నోట్ రాసి చేతి నరాలు కత్తిరించుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పీజీ చదువుతున్న యువతి ఆత్మహత్యకు ఫేమస్ ప్రాంక్ వీడియోల యూట్యూబ్ చానల్ నిర్వహకుడు అని తెలుసుకున్న పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

 పీజీ చదువుతున్న యువతి

పీజీ చదువుతున్న యువతి

తమిళనాడులో తిరుచ్చిలోని తిరువెరుంబూర్ ప్రాంతంలో అన్నామలై అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అన్నామలైకి తనరక్షణ అలియాస్ రక్షణ (22) అనే కుమార్తె ఉంది, తిరుచ్చిలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో రక్షణ పీజీ విద్యాభ్యాసం చేస్తున్నది. కాలేజ్ లో చదువుకుంటున్న రక్షణ త్వరగా చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చెయ్యాలని ఆశపడుతోంది.

 ఫేమస్ యూట్యూబర్

ఫేమస్ యూట్యూబర్

తమిళనాడులో ప్రాంక్ వీడియోలు తీస్తూ అతి తక్కువ సమయంలో సూర్యా అనే యువకుడు ఫేమస్ అయిపోయాడు. చెన్నైకి చెందిన సూర్యా చేసిన ప్రాంక్ వీడియోలు తెగనచ్చడంతో తమిళ ప్రజలు అతని టాలెంట్ కు ఫిదా అయ్యారని తెలిసింది. ఇదే సమయంలో తిరుచ్చిలో పీజీ చదువుతున్న రక్షణ కూడా యూట్యూబర్ సూర్యాకు పరిచయం అయ్యింది.

లైన్ లో పెట్టిన యూట్యూబర్

లైన్ లో పెట్టిన యూట్యూబర్

తమిళనాడులో వెరైటీ వెరైటీగా ప్రాంక్ వీడియోలు తీస్తూ ఎప్పటికప్పుడు యూట్యూబ్ చానల్ లో పోస్టు చేస్తున్న సూర్యాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదే సమయంలో ముందుగా పరిచయం అయిన తిరుచ్చిలోని అందమైన పీజీ విద్యార్థిని రక్షణను యూట్యూబర్ సూర్యా లైన్ లో పెట్టి ఆమెతో టచ్ లో ఉన్నాడు.

ఎంజాయ్ చేసిన యూట్యూబర్

ఎంజాయ్ చేసిన యూట్యూబర్


ఎర్రగా, సన్నగా పొడవుగా ఉన్న పీజీ విద్యార్థిని రక్షణకు మాయమాటలు చెప్పిన యూట్యూబర్ సూర్యా ఆమెను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడని తెలిసింది. ప్రేమికులు రక్షణ, సూర్యా కొంతకాలం చాలా సంతోషంగా కాలం గడిపారని తెలిసింది. తరువాత అవసరం తీరిపోయింది అనుకున్న యూట్యూబర్ సూర్యా రానురాను ప్రియురాలు రక్షణకు దూరం అవుతూ వచ్చాడు.

ప్రియుడు ఘరానాకేటుగాడు

ప్రియుడు ఘరానాకేటుగాడు

రానురాను దూరం అవుతున్న ప్రియుడు సూర్యా అతనికి యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన చాలా మంది అమ్మాయిలను వలలో వేసుకుని జల్సా చేస్తున్నాడని రక్షణకు తెలిసింది. ఈ విషయం తేల్చుకుందామని తిరుచ్చి నుంచి బయలుదేరిన రక్షణ నేరుగా ప్రియుడు సూర్యా నివాసం ఉంటున్న చెన్నై సిటీకి వెళ్లింది.

నిలదీసిన ప్రియురాలు..... నీళ్లు నమిలిన ప్రియుడు

నిలదీసిన ప్రియురాలు..... నీళ్లు నమిలిన ప్రియుడు


ప్రియురాలు రక్షణ ఆమె ప్రియుడు సూర్యాను నీ కథ ఏమిటి అని అతన్ని నిలదీసింది. ప్రియురాలు రక్షణ ముందు నీళ్లు నమిలిన ప్రియుడు సూర్యా సరైన సమాధానం చెప్పకుండా దాటవేశాడని తెలిసింది. తరువాత అక్కడ రక్షణతో గొడవ పెట్టుకున్న సూర్యా మాటామాటా పెరిగిపోవడంతో అక్కడి నుంచి సైలెంట్ గా తప్పించుకుని వెళ్లిపోయాడని సమాచారం.

మోసం చేశాడని చేతి నరాలు కత్తిరించుకున్న ప్రియురాలు

మోసం చేశాడని చేతి నరాలు కత్తిరించుకున్న ప్రియురాలు

చెన్నై నుంచి నేరుగా తిరుచ్చి చేరుకున్న రక్షణ సైలెంట్ గా ఇంటికి వెళ్లిపోయింది. తనను సూర్యా ప్రేమించి మోసం చేశాడని ఆమె రగిలిపోయింది. ప్రియుడు సూర్యాతో తిరిగిన స్టోరీ మొత్తం డెత్ నోట్ లో వివరించిన రక్షణ చేతి నరాలు కత్తిరించుకుంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు రక్షణను తిరుచ్చిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

 యువతి ప్రాణం పోయింది

యువతి ప్రాణం పోయింది

ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. రక్షణను వెంటనే తువకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రక్షణకు వైద్యపరీక్షలు చెయ్యడానికి వచ్చిన డాక్టర్లు అప్పటికే ఆమె మరణించిందని చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేశారు. రక్షణ ఆత్మహత్య చేసుకోవడం తిరుచ్చిలో కలకలం రేపింది. పీజీ చదువుతున్న యువతి ఆత్మహత్యకు ఫేమస్ ప్రాంక్ వీడియోల యూట్యూబ్ చానల్ నిర్వహకుడు అని వెలుగు చూసింది.

Recommended Video

    పాఠశాలల్లో అమ్మాయిల కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేసిన ప్రొఫెసర్ సుజాత
    యూట్యూబర్ పరుగో పరుగు

    యూట్యూబర్ పరుగో పరుగు

    రక్షణ ఆత్మహత్యకు యూట్యూబర్ సూర్యా కారణం అయి తిరుచ్చి పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ప్రాంక్ వీడియోలతో ఫేమస్ అయిన యూట్యూబర్ సూర్యా అనేక మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేశాడని, చాలా మంది వివాహిత మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. రక్షణ ఆత్మహత్యకు సూర్యా కారణం అని వెలుగు చూడటంతో అతను పరారైనాడు. యూట్యూబర్ సూర్యా ఎప్పుడైనా అరెస్టు అయ్యే అవకాశం ఉందని సమాచారం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+