బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cheating: బ్యాంకులో లేడీ ఆఫీసర్ ఉద్యోగం, అమెరికా నుంచి ఫోన్ చేసి వీడు ఏం చేశాడంటే, కిలాడి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న యువతి మంచి అబ్బాయిని చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటున్నది. యువతి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇదే సమయంలో యువతి ప్రముఖ మ్యాట్రీమోనీ వెబ్ సైట్ లో ఆమె ఫోటోలు, పూర్తి వివరాలను అప్ లోడ్ చేసింది. ఇదే సమయంలో ఓ యువకుడు ఆ యువతికి ఫోన్ చేశాడు. తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని, మా సొంత ఊరు బెంగళూరు అని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న యువతిని పరిచయం చేసుకున్నాడు. ఇంత కాలం నీలాంటి అమ్మా కోసం ఎదురు చూశానని, ఇంత వరకు ఇలాంటి అమ్మాయి చిక్కలేదని, నేను బెంగళూరు వచ్చిన ఒక వారంలోనే నిన్ను పెళ్లి చేసుకుంటానని అమెరికాలో ఉంటున్నానని చెప్పిన ఆ యువకుడు ఆమెకు చెప్పాడు. పెళ్లి కోసం తాను బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని, కొంచెం అరియర్స్ క్లియర్ చెయ్యాలంటే డబ్బులు అవసరం ఉందని ఆమెకు చెప్పాడు. తనను పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి పెళ్లి కొడుకు వస్తున్నాడనే ఆనందంలో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న యువకుడి బ్యాంక్ అకౌంట్ కు రూ. 7. 50 లక్షలు పంపించింది. అమెరికా నుంచి పెళ్లి కొడుకు రావడం దేవుడు ఎరుగు, పెళ్లి కొడుకు మొబైల్ ఫోన్ మాత్రం పర్మనెంట్ గా స్విచ్ ఆఫ్ వచ్చింది.

Khiladi lady: పొలిటికల్ లీడర్స్ కు ఇంట్లో పార్టీలు, ఏంకావాలంటే అది ఇస్తానని ?, బాయ్ ఫ్రెండ్ తో!Khiladi lady: పొలిటికల్ లీడర్స్ కు ఇంట్లో పార్టీలు, ఏంకావాలంటే అది ఇస్తానని ?, బాయ్ ఫ్రెండ్ తో!

బెంగళూరులో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న యువతి

బెంగళూరులో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న యువతి

బెంగళూరులోని సుధామనగర్ లో 29 ఏళ్ల చైత్రా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. ప్రముఖ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న చైత్రా బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్న అబ్బాయిని చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటున్నది. యువతి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

మ్యాట్రీమోనీలో ఫోటోలు చూసి ?

మ్యాట్రీమోనీలో ఫోటోలు చూసి ?


ఇదే సమయంలో చైత్రా ప్రముఖ మ్యాట్రీమోనీ వెబ్ సైట్ లో ఆమె ఫోటోలు, పూర్తి వివరాలను అప్ లోడ్ చేసింది. బెంగళూరులో ఉన్న కొంత మంది యువకులు మ్యాట్రీమోనీలోని వివరాలు చూసి చైత్రాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను సంప్రధించారు. అయితే ఎక్కడా చైత్రాకు పెళ్లి కొడుకు సెట్ కాలేదని తెలిసింది.

 హలో...... అమెరికాలో ఉంటున్నాను

హలో...... అమెరికాలో ఉంటున్నాను


2021 డిసెంబర్ 30వ తేదీన ఓ యువకుడు చైత్రాకు ఫోన్ చేశాడు. తన పేరు రాజేష్ అని, తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని, మా సొంత ఊరు బెంగళూరులోని రాజాజీనగర్ అని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న చైత్రాను పరిచయం చేసుకున్నాడు. ఇంత కాలం నీలాంటి అమ్మా కోసం ఎదురు చూశానని, ఇంత వరకు ఇలాంటి అమ్మాయి తనకు చిక్కలేదని చైత్రాకు ఫోన్ లో పరిచయం అయిన రాజేష్ మంచి క్రీమ్ బిస్కేట్ వేశాడు.

 బ్యాంకు అధికారికే మస్కా కొట్టిన కేటుగాడు

బ్యాంకు అధికారికే మస్కా కొట్టిన కేటుగాడు

నేను బెంగళూరు వచ్చిన ఒక వారంలోనే నిన్ను పెళ్లి చేసుకుంటానని అమెరికాలో ఉంటున్నానని చెప్పిన రాజేష్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న చైత్రాకు చెప్పాడు. పెళ్లి కోసం తాను బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని, కొంచెం అరియర్స్ క్లియర్ చెయ్యాలంటే డబ్బులు అవసరం ఉందని రాజేష్ బ్యాంకు అధికారి చైత్రాకు మస్కాకొట్టాడు.

అమెరికా మొగుడు వస్తున్నాడని ఆలోచించకుండా ?

అమెరికా మొగుడు వస్తున్నాడని ఆలోచించకుండా ?


తనను పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి పెళ్లి కొడుకు రాజేష్ బెంగళూరు వస్తున్నాడనే ఆనందంలో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న చైత్రా రాజేష్ చెప్పిన బ్యాంక్ అకౌంట్ కు మూడుసార్లు రూ. 7. 55 లక్షలు పంపించింది. అయితే నెల రోజుల్లోనే రూ. 7. 55 లక్షలు తీసుకున్న రాజేష్ మళ్లీ తనకు ఇంకా రెండు లక్షలు కావాలని చైత్రా మీద ఒత్తిడి చేశాడు.

మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ తో సీన్ సిడేల్

మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ తో సీన్ సిడేల్

రెండు వారాల నుంచి ఈ రోజు వస్తాను, రేపు వస్తాను అంటూ మాయమాటలు చెప్పిన రాజేష్ అతని మొబైల్ ఫోన్ స్వీచ్ ఆఫ్ చేశాడు. అమెరికా నుంచి పెళ్లి కొడుకు రాజేష్ రావడం దేవుడు ఎరుగు, పెళ్లి కొడుకు మొబైల్ ఫోన్ మాత్రం పర్మనెంట్ గా స్విచ్ ఆఫ్ రావడంతో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న యువతి బెంగళూరులోని సెంట్రల్ సీఇఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేష్ ఇచ్చిన బ్యాంకు అకౌంట్ ఆధారంగా కిలాడి పెళ్లి కొడుకు కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Cheating: Young man dupes bank lady officer of Rs 7. 55 lakhs after marriage vow in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X