Cheating: నిత్య పెళ్లి కొడుకు, భర్త మొబైల్ ఫోన్ లో లేడీస్ ఫోటోలు చూసిన భార్య ?, పెళ్లి కాకుండా, ఎంజాయ్ !

చెన్నై/ పెరంబూర్: యవ్వనంలో ఉన్న యువకుడు ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో భార్య కుటుంబ సభ్యులు అతనికి కట్నం కింద నగలు, డబ్బు ఇచ్చారు. భర్త ఇంటికి వెళ్లిన భార్య అతనితో కాపురం చేస్తూ వెళ్లింది. కొంతకాలం తరువాత భర్త మొబైల్ ఫోన్ లో అనేక మంది అమ్మాయిలతో ఫోటోలు తీసుకున్నాడని భార్య గుర్తించింది. ఎవరు వాళ్లు అని భర్తను ప్రశ్నిస్తే గతంలో తనకు నిశ్చితార్థం వరకు కొన్ని సంబంధాలు వచ్చి నిలిచిపోయాయని, ఒకరిని పెళ్లి చేసుకుని వదిలేశానని, నీతో మాత్రం జీవితాంతం కలిసి ఉంటానని ఆమెకు మాయమాటలు చెప్పాడు. జరిగిందేదో జరిగిపోయింది, నాతో జీవితాంతం తన భర్త కలిసే ఉంటాడని చెప్పాడని ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. కొంతకాలం తరువాత బైక్ కొనుగోలు చెయ్యడానికి రూ. 1 లక్ష, బంగారు నగలు తీసుకురావాలని అతని భార్యను పుట్టింటికి తరిమేశాడు. కొన్నిరోజులు పోలీసులు వెళ్లి భర్తను రేప్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది యువతులను వివాహం చేసుకున్న భర్త చాలా మందిని మోసం చేశాడని తెలుసుకున్న అతని భార్య షాక్ అయ్యింది. పెళ్లి కాకుండానే ఓ యువతితో కాపురం చేసిన తన భర్త ఆమెను 8 నెలల గర్బవతిని చేశాడని తెలుసుకున్న భార్య బిత్తరపోయింది.

 కేటుగాడితో పెళ్లి

కేటుగాడితో పెళ్లి

తమిళనాడులోని పెరంబూరు జిల్లాలోని మంగళమేడు ప్రాంతానికి చెందిన మురుగన్ అనే వ్యక్తి కుమార్తె సుమా (23) వివాహం చెయ్యాలని నిర్ణయించారు. పెరంబూరు జిల్లాలోని పెన్నకోణం గ్రామంలో నివాసం ఉంటున్న బాలరసు (25) అనే యుకుడితో సుమా వివాహం చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు.

మురిసిపోయిన భార్య

మురిసిపోయిన భార్య


మార్చి 15వ తేదీన బాలరసు, సుమా వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సుమా కుటుంబ సభ్యులు బాలరసుకు కట్నం కింద నగలు, డబ్బు ఇచ్చారు. భర్త బాలరసు ఇంటికి వెళ్లిన సుమా అతనితో కాపురం చేస్తోంది. తన భర్త బాలరసు తనను బాగా చూసుకుంటున్నాడని, సాయంత్రం పూట షికార్లకు పిలుచుకుని వెలుతున్నాడని అతని భార్య సుమా మురిసిపోయింది.

భర్త మొబైల్ ఫోన్ లో లేడీస్ తో సెల్ఫీ ఫోటోలు

భర్త మొబైల్ ఫోన్ లో లేడీస్ తో సెల్ఫీ ఫోటోలు


కొంతకాలం తరువాత బాలరసు మొబైల్ ఫోన్ ను అతని భార్య సుమా పరిశీలించింది. తన భర్త బాలరసు అనేక మంది అమ్మాయిలతో సెల్ఫీ ఫోటోలు తీసుకున్నాడని సుమా గుర్తించింది. ఎవరు వాళ్లు అని సుమా ప్రశ్నిస్తే గతంలో తనకు నిశ్చితార్థం వరకు కొన్ని సంబంధాలు వచ్చి నిలిచిపోయాయని, ఒకరిని పెళ్లి చేసుకుని వదిలేశానని, నీతో మాత్రం జీవితాంతం కలిసి ఉంటానని బాలరసు అతని భార్య సుమాకు మాయమాటలు చెప్పాడు.

 నగలు, డబ్బులు కోసం భార్యను తరిమేశాడు

నగలు, డబ్బులు కోసం భార్యను తరిమేశాడు


జరిగిందేదో జరిగిపోయింది, నాతో జీవితాంతం తన భర్త బాలరసు కలిసే ఉంటాడని చెప్పాడని అనుకున్న సుమా సైలెంట్ గా ఉండిపోయింది. కొంతకాలం తరువాత బైక్ కొనుగోలు చెయ్యడానికి రూ. 1 లక్ష, బంగారు నగలు తీసుకురావాలని బాలరసు అతని భార్య సుమాను పుట్టింటికి తరిమేశాడు. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బులు లేవని, కావాలంటే రూ. 50 వేలు ఇస్తామని సుమా కుటుంబ సభ్యులు బాలరసుకు చెప్పారు. డబ్బులు, నగలు తీసుకు వస్తేనే కాపురానికి రావాలని, లేదంటే పుట్టింటిలోనే ఉండిపోవాలని బాలరసు అతని భార్య సుమాకు తేల్చి చెప్పాడు.

 అమ్మాయి రేప్ కేసుతో హడల్

అమ్మాయి రేప్ కేసుతో హడల్

సుమా పుట్టింటిలో ఉన్న సమయంలోనే ఆమె భర్త బాలరసు ఇంటికి శివగంగై జిల్లాలోని కారైకుడి పోలీసులు వెళ్లారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఓ యువతి మీద అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ బాలరసును పోలీసులు అరెస్టు చేశారు. బాలరసును అరెస్టు చేసి విచారణ చేసిన పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.

పెళ్లి కాకుండానే గర్బవతిని చేసిన కేటుగాడు

పెళ్లి కాకుండానే గర్బవతిని చేసిన కేటుగాడు

పెరంబూరు జిల్లాలోని సిరువచ్చూరు గ్రామంలో నివాసం ఉంటున్న ఓ యువతిని బాలరసు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె దగ్గర బంగారు నగలు, నగదు తీసుకుని ఆమెను 8 నెలల గర్బవతిని చేశాడని, తరువాత ఆమెను పెళ్లి చేసుకోకుండా మరో మహిళను వివాహం చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 డబ్బు, నగల కోసం ఆశపడ్డాడు

డబ్బు, నగల కోసం ఆశపడ్డాడు


బాలరసు ఇప్పటికే కొందరు మహిళలను వివాహం చేసుకుని నెల, రెండు నెలలు వారితో కాపురం చేసి డబ్బు, నగలు తీసుకుని వారిని పుట్టింటికి తరిమేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇప్పటికే అనేక మంది యువతులను తన భర్త బాలరసు వివాహం చేసుకున్నాడని, చాలా మందిని మోసం చేశాడని తెలుసుకున్న అతని కొత్త భార్య సుమా షాక్ అయ్యింది. సుమా కూడా ఆమె భర్త బాలరసు మీద వరకట్నం వేదింపుల కేసు పెట్టడంతో అతనికి పోలీసులు సినిమా చూపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+