వామ్మో.. పెళ్లిలో ప్రత్యక్షమైన చిరుత పులి.. వధూవరులు కారులో లాక్..
ఓ వైపు అంగ రంగవైభవంగా పెళ్లి జరుగుతోంది. వధూవరులు, బంధువులు,స్నేహితులు, పిల్లలతో అక్కడి వాతావరణం సందడిగా ఉంది. అయితే ఆ ఫంక్షన్ లోకి ఓ చిరుత పులి గేట్లు నెట్టుకుని చొరబడింది. పులిని చూసిన బంధువులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో షాకింగ్ ఘటన జరిగింది. లక్నోకు చెందిన అక్షయ్ శ్రీవాస్తవ, జ్యోతి కుమారిల వివాహం లక్నోలోని ఎంఎం లాన్ లో రాత్రి జరిగేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. బంధువులు, స్నేహితులు, వధూవరుల కుటుంబసభ్యులతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పెళ్లి ఫంక్షన్ లోకి చిరుతపులి ఒక్కసారిగా ప్రవేశించింది. గేట్లు పడగొట్టి మండపంలోకి చొరబడింది. చిరుతను చూసిన బంధువులు ఒక్కసారిగా రోడ్డుపైకి పరుగులు తీశారు. ఓ వ్యక్తి చిరుత భయంతో భవనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేశాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలు అయ్యాయి.

చిరుత ఫంక్షన్ లోకి ప్రవేశించిన సమయంలో వధూవరులు ఇద్దరూ పెళ్లిమండపం పైనే ఉన్నారు. చిరుతను చూసిన వాళ్లు పరిగెత్తుతూ కారులోకి వెళ్లి లాక్ వేసుకున్నారు.సమాచారం అందుకున్న అటవీ అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. దాదాపు 5 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. చిరుత భవనంలోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నట్లు గుర్తించారు. దాన్ని బంధించే క్రమంలో ఓ అటవీ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అర్థరాత్రి 3గంటల సమయంలో చిరుతను అధికారులు పట్టుకున్నారు. ఈ దాడిలో కెమెరా సిబ్బంది కూడా గాయపడింది.అధికారులు, పోలీసులు కలిసి ఎట్టకేలకు చిరుతను పట్టుకోవడంతో వివాహం మళ్లీ మొదలైంది.
लखनऊ में शादी समारोह में घुसा तेंदुआ
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) February 13, 2025
जिसके बाद समारोह में भगदड़ मच गई.
वन विभाग की टीम ने कड़ी मशक्कत के बाद तेंदुए को पकड़ा
तेंदुए ने वन विभाग के एक कर्मचारी को कर दिया था घायल#Lucknow #leopard #Wedding #UttarPradesh pic.twitter.com/DpMU7SWucD












Click it and Unblock the Notifications