బయోకాన్ లో అగ్నిప్రమాదం: బాయిలర్లు పేలుడు !

బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటి సమీపంలోని జిగణి లింక్ రోడ్డులోని బయోకాన్ పరిశ్రమ (బయోకాన్ పార్క్)లో ఐదు బాయిలర్లు ఒకదాని తరువాత ఒకటి వరుసగా పేలిపోయాయి.

బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటి సమీపంలోని జిగణి లింక్ రోడ్డులోని బయోకాన్ పరిశ్రమ (బయోకాన్ పార్క్)లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. బాయిలర్లు ఉన్న గదిలో అగ్నిప్రమాదం జరిగింది.

ఐదు బాయిలర్లు ఒకదాని తరువాత ఒకటి వరుసగా పేలిపోయాయి. బాయిలర్లు పేలిపోయిన సమయంలో ఆ గదిలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Chemical fire breaks out at Biocon in Bengaluru.

ఆరు వాహనాలతో మంటలు అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ వలనే బాయిలర్లు పేలిపోయాయని పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. బయోకాన్ సిబ్బంది సరైన సమయంలో స్పందించి మంటలు అదుపు చేశారు.

మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బాయిలర్లు పెద్ద శభ్దంతో పేలిపోవడంతో బాంబు పేలుళ్లు జరిగాయని స్థానికులు హడలిపోయారు. చివరికి విషయం తెలుసుని ఊపిరిపీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+