కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి ముందు పేలుడు, దుర్మరణం, సినిమా షూటింగ్ కోసం, ప్రముఖ నిర్మాత !
బెంగళూరు: బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రముఖ నిర్మాత మునిరత్న ఇంటి ముందు జరిగిన పేలుడులో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల విచారణలో పేలుడుకు కారణాలు వెలుగు చేశాయి. సినిమా షూటింగ్ కోసం తీసుకు వచ్చిన రసాయనాల కారణంగా పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు.
ప్లాస్టిక్ మౌల్డింగ్ కోసం తీసుకువచ్చిన కెమికల్ పేలుడుకు కారణం అయ్యిందని పోలీసులు అంటున్నారు. పుత్తలి నిర్మాణం కోసం కెమికల్ ఉపయోగిస్తారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కెమిల్ తీసుకువెళ్లడానికి వెంకటేష్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లిన సమయంలో పేలుడు జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

పేలుడు జరిగిన సమయంలో స్థానికులు హడలిపోయారు. బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర శాసన సభ ఎమ్మెల్యే మునిరత్న వయ్యాలికావెల్ లో నివాసం ఉంటున్నారు. పేలుడు జరిగిన సమయంలో మరణించిన వ్యక్తి మృతదేహం చిందరబందర అయ్యిందని స్థానికులు తెలిపారు.












Click it and Unblock the Notifications