కూల్ డ్రింక్ లో మత్తు మందు: ఎంబీఏ విద్యార్థిని రేప్, నగ్న వీడియో, నీ భర్తకు పంపిస్తా !
ప్రేమించి పెళ్లికి నిరాకరించిన యువతి మీద ఆమె మాజీ ప్రియుడు ప్రతికారం తీర్చుకుంటానని హెచ్చరించాడు. ఆమె నగ్నంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న హర్డిల్ క్రీడాకారుడిని చెన్నై నగర
చెన్నై: ప్రేమించి పెళ్లికి నిరాకరించిన యువతి మీద ఆమె మాజీ ప్రియుడు ప్రతికారం తీర్చుకుంటానని హెచ్చరించాడు. ఆమె నగ్నంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న హర్డిల్ క్రీడాకారుడిని చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు.
బాధితురాలు నగ్నంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియో తీసిన మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. చెన్నైలోని జ్యోతియమ్మాల్ నగర్ లో నివాసం ఉంటున్న దీపక్ అలియాస్ దేనియల్ (22) అనే హర్డిల్స్ క్రీడాకారుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

ఎంబీఏ యువతి
చెన్నైలోని ట్రిప్లికేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 22 ఏళ్ల యువతి కీల్పాక్కంలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఎంబీఏ విద్యాభ్యాసం చేస్తోంది. ఆమె తండ్రి హర్డిల్స్ క్రీడా కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఇక్కడే దీపక్ అలియాస్ డేనియల్ శిక్షణ పొందుతున్నాడు.

తండ్రి కోసం వచ్చి లవ్
తన తండ్రి నిర్వహిస్తున్న హర్డిల్స్ క్రీడా కేంద్రానికి తరుచుగా వస్తున్న యువతి దీపక్ తో పరిచయం పెంచుకుంది. తరువాత ఇద్దరూ సన్నిహితంగా దగ్గరై ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి సన్నిహితంగా తిరగడం మొదలు పెట్టారు. సినిమాలు, షికార్లుకు వెళ్లారు.

ఒక్క సారిగా బ్రేక్
ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో దీపక్ కు ఆమె దూరం అయ్యింది. నెల రోజుల పాటు ఆమె దీపక్ తో మాట్లాడలేదు. అనేక సార్లు ఆమె మొబైల్ కు ఫోన్ చేసినా పట్టించుకోలేదు. యువతి ప్రేమ విషయం వారి తల్లిదండ్రులకు తెలిసిపోయింది.

వరుడు రెడీ
యువతి కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చెయ్మాలని వరుడి కోసం వెతికారు. ఈ విషయం తెలుసుకున్న దీపక్ యువతిని ప్రశ్నించాడు. మా ఇంటిలో చూసిన వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటానని యువతి తేల్చి చెప్పింది. ఈ విషయంలో దీపక్ రెచ్చిపోయాడు.

సోషల్ మీడియాలో వీడియో !
తనతో సన్నిహితంగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతానని దీపక్ ఆమెను బెదిరించాడు. అంతే కాకుండా నువ్వు పెళ్లి చేసుకునే వ్యక్తికి వాట్సాప్ లో నగ్న చిత్రాలు పంపిస్తానని, అప్పుడు నువ్వు ఏం చేస్తావో చేసుకో అంటూ హెచ్చరించాడు.

మమ్మీ, డాడీకి చెబితే
దీపక్ బెదిరించడంతో ఆందోళన చెందిన యువతి తన తల్లిదండ్రులకు జరిగిన విషయం మొత్తం చెప్పింది. యువతి కుటుంబ సభ్యుల కీల్పాకం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీపక్ ను అరెస్టు చేసి విచారణ చెయ్యడంతో అసలు విషయం తెలిసింది.

ఫ్రెండ్ రూంలో రేప్ చేశాను !
యువతిని తన ఫ్రెండ్ రూంకు తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేసి వీడియో, ఫోటోలు తీశానని దీపక్ విచారణలో అంగీకరించాడని పోలీసులు చెప్పారు. దీపక్ మొబైల్ స్వాధీనం చేసుకుని అతన్ని జైలుకు పంపించామని మంగళవారం కీల్పాక్కం మహిళ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications