ఆ టెక్కీ దొంగ కాదు, సీరియల్ రేపిస్ట్: 50మందిపై.. వీడియో తీసి..
చెన్నై: చోరీ చేస్తూ పట్టుబడ్డ నిందితుడు సీరియల్ రేపిస్ట్ అని తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు. నిందితుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావడం గమనార్హం. తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
Recommended Video


దొంగతనం కేసులో అరెస్ట్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ ఇంట్లో చోరీ జరిగిందని, విలువైన వస్తువులతోపాటు కొంత నగదు ఓ దొంగ ఎత్తుకెళ్లాడని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి ఫిర్యాదు అందింది పోలీసులు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు మదన్ అరివలగన్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.

50మందిపై ఘాతుకం.. పోలీసులకు షాక్
కాగా, విచారణలో భాగంగా నిందితుడు అరివలగన్ మొబైల్‌లోని వీడియోలు చూసిన పోలీసులు షాకయ్యారు. దాదాపు 50మంది వరకు యువతులు, మహిళలపై అత్యాచారం జరుపుతుండగా తీసిన వీడియోలు నిందితుడి స్మార్ట్‌ఫోన్లో ఉన్నాయి. దీంతో ఇది మామూలు చోరీ కేసు కాదని భావించిన పోలీసులు.. నిందితుడ్ని అన్ని కోణాల్లో విచారించారు.

టెక్కీ జాబ్ వదిలేసి..
ఈ క్రమంలో తమది క్రిష్ణగిరి జిల్లా మథుర్ గ్రామం అని, క్రిష్టగిరి కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు నిందితుడు తెలిపాడు. బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా చేశానని, 2015లో అక్కడ జాబ్ మానేసి చెన్నైకి వచ్చినట్లు తెలిపాడు.

తొలుత దొంగగా.. ఆ తర్వాత..
తొలుత ఉద్యోగం కోసం యత్నించగా ఎవరూ పట్టించుకోలేదని, మెల్లమెల్లగా చోరీలకు అలవాటు పడ్డానని చెప్పాడు. ఆ తర్వాత ఒంటరి యువతులు, మహిళలున్న ఇళ్లే లక్ష్యంగా చోరీలు చేస్తూ, వారిపై అత్యాచారానికి కూడా పాల్పడినట్లు అంగీకరించాడు. అంతేగాక, ఆ ఘాతుకాన్ని వీడియోలు తీసి ఎవరికీ చెప్పవద్దని బెదిరిలింపులకు గురిచేశానని నిందితుడు చెప్పారు.

రేప్‌ను వీడియో తీసి..
ఇలా సుమారు 50మంది యువతులు, మహిళలపై అత్యాచారానికి పాల్పడి, వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు నిందితుడు అరివలగన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. కాగా, పరువు పోతుందని చాలా మంది మహిళలు ఫిర్యాదు చేయలేదని, తమకు అందిన ఒక్క ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
-
సమ్మర్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే రావాలనిపించదు.. తక్కవ బడ్జెట్ లో ఇలా చుట్టేయండి.. -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications