Delivery boy: జొమాటో డెలవరీ బాయ్ ని అడ్డంగా నరికేశారు, 20 క్రిమినల్ కేసులు, నేనే కింగ్ !
చెన్నై: జొమాటో డెలవరీ బాయ్ గా పని చేస్తున్న యువకుడు ప్రతిరోజూ ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్నాడు. పని పూర్తి అయిన తరువాత ఆ యువకుడు అతను నివాసం ఉంటున్న ఏరియాలో రెచ్చిపోతున్నాడు. రోజూ స్నేహితులతో కలిసి మద్యం సేవించడం, గంజాయి సేవించడం చేస్తున్నాడు. గంజాయి, మద్యం మత్తులో ఊగుతున్న డెలవరీ బాయ్ అతని స్నేహితులను కలిసి అమాయకులను చంపేస్తానని బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏరియాలో నేనే రౌడీని, నామాటకు ఎవరైనా ఎదురు చెబితే వారిని నరికేస్తానని ఆ ఏరియాలోని పలువురు యువకులను బెదిరించడం మొదలు పెట్టారు. రాత్రి పని ముగించుకుని ఇంటి సమీపంలోని వెళ్లిన డెలవరీ బాయ్ గంజాయి సేవించి రోడ్డు పక్కన బైక్ మీద కుర్చుని రెచ్చిపోయాడు. ఆ సమయంలో మూడు బైకుల్లో వెళ్లిన యువకులు డెలవరీ బాయ్ ను దారుణంగా నరికి చంపేశారు. హత్యకు గురైన జొమాటో డెలవరీ బాయ్ మీద 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని వెలుగు చూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. జొమాటో డెలవరి బాయ్ హత్య కేసులో ఇప్పటికే కొందరిని చెన్నై సిటీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

జొమాటో డెలవరీ బాయ్ ఉద్యోగం
చెన్నై సిటీలోని మెరీనా బీచ్ సమీపంలోని నడుకుప్పంలో అజిత్ కుమార్ అలియాస్ అజిత్ (24 అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. జొమాటో డెలవరీ బాయ్ గా పని చేస్తున్న అజిత్ కుమార్ ప్రతిరోజూ ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్నాడు. పని పూర్తి అయిన తరువాత అజిత్ కుమార్ అతను నివాసం ఉంటున్న మెరినా ఏరియాకు వెళ్లి అక్కడ రెచ్చిపోతున్నాడు.

మద్యం, గంజాయికి బానిస
అజిత్ కుమార్ పని పూర్తి అయిన తరువాత రోజూ స్నేహితులతో కలిసి మద్యం సేవించడం, గంజాయి సేవించడం చేస్తున్నాడు. గంజాయి, మద్యం మత్తులో ఊగుతున్న జొమాటో డెలవరీ బాయ్ అజిత్ కుమార్ అతని స్నేహితులను కలిసి అమాయకులను చంపేస్తానని బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఏరియాలో నేనే కింగ్
మెరినా బీచ్ ఏరియాలో నేనే రౌడీని, నామాటకు ఎవరైనా ఎదురు చెబితే వారిని నరికేస్తానని ఆ ఏరియాలోని పలువురు యువకులను అజిత్ కుమార్ బెదిరించడం మొదలు పెట్టారు. రాత్రి పని ముగించుకుని ఇంటి సమీపంలోని వెళ్లిన జొమాటో డెలవరీ బాయ్ అజిత్ కుమార్ గంజాయి సేవించి రోడ్డు పక్కన బైక్ మీద కుర్చుని కేకలు వేస్తూ అక్కడ రెచ్చిపోయాడు.

అడ్డంగా నరికేసిన ప్రత్యర్థులు
ఆ సమయంలో మూడు బైకుల్లో వెళ్లిన కొందరు యువకులు జొమాటో డెలవరీ బాయ్ అజిత్ కుమార్ ను కత్తులతో దారుణంగా నరికి చంపేశారు. హత్యకు గురైన జొమాటో డెలవరీ బాయ్ అజిత్ కుమార్ మీద చెన్నైలోని అనేక పోలీస్ స్టేషన్లలో ఇప్పటి వరకు 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. అజిత్ కుమార్ హత్యకు గురి కావడంతో మెరినా బీచ్ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications