40 లక్షల మంది ఇళ్లలోనే: ప్రత్యక్ష నరకం (ఫోటోలు)
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగర ప్రజలు ప్రత్యక్షంగా నరకం చూస్తున్నారు. కాలు తీసి బయటపెట్టలేక విలవిలలాడుతున్నారు. ఎక్కడ చూసినా వర్షం నీరు, డ్రైనేజ్ ల నుంచి వచ్చిన మురికి నీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
సహాయక చర్యలు చేపట్టేందుకు అన్ని బృందాలు సిద్దంగా ఉన్నా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రజలకు కాలు తీసి కాలు బయటపెట్టడానికి వీలు కావడం లేదు. మురికివాడలు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఆహార పొట్లాలు, తాగునీరు బాటిల్స్ అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. చెన్నైలోని పలు మురికివాడలలో ఆకలితో పిల్లలు చేస్తున్న ఆర్తనాదాలతో దద్దరిల్లుతున్నాయి. దిగువ ప్రాంతాలలో నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు.
படகு
உதவிக்கு அழைக்கவும் :
தேனாம்பேட்டை
- 9445190009
ஆலந்தூர் - 9445190012
வலசரவாக்கம்- 9445190011
#chennairainshelp #chennairains
— Gøωthâϻ (@IamGK24) December 2, 2015 
ఏమీ చెయ్యలేని పరిస్థితి
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ రంగంలోకి దిగినా ఎప్పటికప్పుడు వరద నీరు పెరిగిపోతుండటంతో వారు ఏమీ చెయ్యలేక చేతులు ఎత్తేస్తున్నారు.

700 మంది సిబ్బంది
చెన్నై నగరంలో సహాయకపనుల్లో పాల్గోనడానికి 700 మంది సిబ్బంది సిద్దంగా ఉన్నారు. పలు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టారు.

ఫోన్లు పని చెయ్యడం లేదు
చెన్నై నగరంలోని అనేక ప్రాంతాలలో ఫోన్లు పని చెయ్యకపోవడంతో వారు బంధువులతో సైతం మాట్లాడలేకపోతున్నారు. రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

నాలుగు లక్షల ఇళ్లు మునిగిపోయాయి
అడయార్ నది ఒక్క సారిగా పొంగడంతో చెన్నై నగరంలోకి నీరు చేరుకుంది. దాదాపు నాలుగు లక్షల ఇళ్లు నీటిలో మునిగిపోయాయని అధికారులు అంటున్నారు.

40 లక్షల మంది ఇళ్లలోనే
చెన్నై నగరంలోని పలు ప్రాంతాలలో నివాసం ఉంటున్న దాదాపు 40 లక్షల మంది ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు.

మొదటి, రెండవ అంతస్థులలో
నీరు పీకల ఎత్తుకు చేరుకోవడంతో ప్రజలు మొదటి, రెండవ అంతస్థులలో తలదాచుకుంటున్నారు.

నిత్యవసర వస్తువులు నిల్
చెన్నై నగరంలోని దాదాపు చాల మంది ఇళ్లలో నిత్యవసర వస్తువులు ఖాళీ కావడంతో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

వెళ్లిపోదామన్నా కుదరటం లేదు
నగరం విడిచి వెళ్లిపోదాం అనుకుంటున్నా చెన్నై నగర ప్రజల మీద వరుణ దేవుడు కనికరించడం లేదు.

24 ప్రత్యేక జోన్లు
చెన్నై నగరంలో 24 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు చేపట్టడానికి ప్రత్యేక బృందాలు ఈ జోన్లలో సిద్దంగా ఉన్నాయి.

ఎన్నిరోజులో చెప్పలేం
ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేమని అధికారులు అంటున్నారు. ఇలాగే ఉంటే సహాయక చర్యలు ఎలా చేపట్టాలని వారు తలలు పట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications