వరుడి అరెస్టు: ఆంటీ కొడుకును పెళ్లాడిన వధువు
చెన్నై: వరుడిని పోలీసులు అరెస్టు చేయడంతో వధువు తన ఆంటీ కూతురిని వివాహమాడింది. మరో మహిళ ఫిర్యాదు చేయడంతో వరుడిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లాడుతానని మోసం చేశాడని మరో మహిళ వరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.
తాను ప్రేమించిన యువకుడు మరో యువతిని పెళ్లాడుతున్నాడని తెలుసుకున్న ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహమాడుతానని హామీ ఇచ్చి అతను తనతో సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత తనను వదిలేశాడని ఆమె ఫిర్యాదు చేిసంది.

పెళ్లికి కొన్ని గంటల ముందు యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వరుడి అరెస్టుతో ఖిన్నులైన వధువు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తోచక హైరానా పడ్డారు.
పెళ్లి మండపం వద్ద ఉన్న ఆంటీ కుమారుడిని వివాహం చేసుకుంటావా అని వధువును అడిగారు. ఆంటీ కుమారుడు, వధువు అందుకు అంగీకరించారు. దీంతో వారికి వివాహం జరిగిపోయింది.












Click it and Unblock the Notifications