50మంది అమ్మాయిల్ని రేప్ చేసి, వీడియోలు తీశాడు: ట్రాఫిక్ పోలీసులు ఆపితే... ఫోన్లో చూసి షాకయ్యారు
చెన్నై: తమిళనాడులో దారుణం జరిగింది. కరడుగట్టిన రేపిస్ట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో, రోడ్ల మీద నడిచి వెళ్లే మహిళలు, యువతులే అతని టార్గెట్. వారిపై దాడి చేసి అత్యాచారం చేసేవాడు. ఇలా 50 మంది పైన అత్యాచారానికి పాల్పడ్డాడు.
సాఫ్టువేర్ ఇంజినీర్ యువతులు, నైట్ డ్యూటీ చేసే మహిళలు అతని బాధితుల్లో ఎక్కువగా ఉన్నారు. వారితో ఇంటి వరకు వెనకాలే వెళ్లడం, బలవంతంగా వారి ఇంట్లోకి జొరబడి, బెదిరించి అత్యాచారం చేసేవాడు. కొన్ని సందర్భాలలో రేప్ చేస్తుండగా తీసిన వీడియోలు కూడా తీశాడు.

అతని మొబైల్ ఫోన్లో యువతుల వీడియోలు, ఫోటోలు
అరివళగన్ అనే వ్యక్తి దాదాపు యాభై మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనిని పోలీసులు అరెస్టు చేశారు. అతని మొబైల్ ఫోన్‌లో తన చేతిలో బలైన అమ్మాయిల అత్యాచారానికి సంబంధించిన వీడియోలను కూడా దాచిపెట్టుకున్నాడు. వీటిని పోలీసులు గుర్తించి, షాకయ్యారు. అతని ఫోన్లో ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయి.

ఫిర్యాదు చేయకపోవడం కలిసి వచ్చింది
అతని బాధితులు ఎవరు కూడా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. వారు అమ్మాయిలు కాబట్టి ముందుకు రాలేకపోయారని తెలుస్తోంది. అతను బలవంతం చేసి, బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడినప్పడికీ యువతులు అతని అరెస్టుకు ముందు, ఆ తర్వాత బయటకు రాలేదు. తనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడాన్ని ఆసరాగా తీసుకొని, వారిని వేధించాడు. పోలీసులు అతనిని డిసెంబర్ 14వ తేదీన అరెస్టు చేశారు.

రేపిస్ట్ బాగోతం ఇలా బయటపడింది
ఈ రేపిస్ట్ బాగోతం బయటపడిన తీరు కూడా ఆశ్చర్యంగానే ఉంది. అతను వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. పేపర్స్ చూపించమని చెప్పారు. కానీ అతని వద్ద అందుకు సరైన కాగితాలు లేవు. అతనిని అన్ని రకాలుగా విచారించడం మొదలు పెట్టారు. అతని నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో పోలీసులు ఎందుకైనా మంచిదని అతని ఫోన్ తీసుకొని పరిశీలించారు. అప్పుడు అతని ఫోన్లో ఉన్న వాటిని చూసి ఆశ్చర్యపోయారు.

కేసు దర్యాఫ్తు
ఆ ఫోన్లో అతని అత్యాచారానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కనిపించాయి. ఆ ఫోన్లో దాదాపు 50 మంది యువతుల వీడియోలు ఉన్నాయి. దీనిని గుర్తించిన పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అనంతరం అత్యాచారం కోణంలో అతనిని విచారించారు. యువతులు, మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు వారి ఇళ్లలోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఓసారి వారిపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత వాటిని చూపించి, బ్లాక్ మెయిల్ చేసేవాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications