leader: సైనికుడి హత్య కేసులో అధికార పార్టీ లీడర్ ఫ్యామిలీకి హైకోర్టులో షాక్, అహంకారంతోనే చేశారు !

సైనికుడిని హత్య చేసిన అధికార పార్టీ నాయకుడికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అధికారంలో ఉన్నామనే అహంకారంతోనే లీడర్ ఫ్యామిలీ హత్య చేసిందని ఆరోపిస్తున్నారు.

చెన్నై/క్రిష్ణగిరి: ఓ యువకుడు భారత సైన్యంలో ఉద్యోగం చేస్తున్నాడు. సెలవుల్లో సొంత ఊరికి వెలుతున్న సైనికుడు అతని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి తరువాత మళ్లీ విధులకు హాజరౌతున్నాడు. సెలవుల్లో ఇంటికి వెళ్లిన సైనికుడికి, అధికార పార్టీకి చెందిన రాజకీయ పార్టీ నాయకుడి మధ్య గొడవలు జరిగాయి. అధికార పార్టీ నాయకుడితో పాటు అతని కుటుంబ సభ్యుల చేతిలో సైనికుడు హత్యకు గురైనాడు. సైనికుడిని హత్య చేసిన అధికార పార్టీ నాయకుడికి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అధికారంలో ఉన్నామనే అహంకారంతోనే లీడర్ ఫ్యామిలీ హత్య చేసిందని ఆరోపిస్తున్నారు. నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని సైనికుడి కుటుంబ సభ్యులు మనవి చేస్తున్నారు.

సోదరులు సైనికులు

సోదరులు సైనికులు

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని వెలంపట్టిలోని ఎంజీఆర్ నగర్ ప్రాంతంలో ప్రభు, ప్రభాకరన్ అనే ఇద్దరు సోదరులు నివాసం ఉంటున్నారు. ప్రభాకరన్, ప్రభు ఇద్దరూ సైన్యంలో ఉద్యోగం చేస్తున్నారు. సెలవులపై స్వగ్రామానికి వచ్చిన ప్రభు, ప్రభాకరన్ వాళ్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ తరువాత విధులకు వెళ్లిపోతున్నారు.

అధికార పార్టీ నాయకుడితో గొడవ

అధికార పార్టీ నాయకుడితో గొడవ

ప్రభు, ప్రభాకరన్ కుటుంబ సభ్యులు తాగునీటి ట్యాంకు దగ్గర బట్టలు ఉతికారు. అప్పుడు నాగరసంబట్టి మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిలర్, అధికార పార్టీ అయిన డీఎంకే పార్టీకి చెందిన చిన్నస్వామి ఇక్కడ బట్టలు ఉతకకూడదని గొడవ పెట్టుకున్నారు. ఆ సందర్బంలో సైనికులు ప్రభాకరన్, ప్రభు కుటుంబ సభ్యులు, డీఎంకే కౌన్సిలర్ చిన్నస్వామి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

సైనికుల ఫ్యామిలీ మీద దాడులు

సైనికుల ఫ్యామిలీ మీద దాడులు

డీఎంకే కౌన్సిలర్ చిన్నస్వామి అతని కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి సైనికులు ప్రభు, ప్రభాకరన్‌ తో పాటు వారి తల్లి కన్నమ్మాళ్‌, తండ్రి మత్తయన్‌లపై తీవ్రంగా దాడి చేశాడు. గాయపడిన నలుగురు వ్యక్తులను హోసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సైనికుడు ప్రభు ఫిబ్రవరి 14వ తేదీన సాయంత్రం ఆసుపత్రిలో చనిపోయాడు.

హత్య కేసులో 9 మంది

హత్య కేసులో 9 మంది

నాగరసంబట్టి పోలీస్ స్టేషన్‌లో చిన్నస్వామి, అతని కుటుంబ సభ్యుల మీద హత్య కేసు నమోదు చేశారు. డీఎంకే కౌన్సిలర్ చిన్నస్వామి, అతని కుమారుడు పులిపాండి, సోదరుడు కాలియప్పన్, బంధువు మథాయన్‌తో సహా మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. చిన్నస్వామి కుమారుడు పులిపాండి, సోదరుడు కాళీయప్పన్, బంధువు మథాయన్‌లు బెయిల్‌ కోసం మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కోర్టులో అభ్యంతరం చెప్పిన పోలీసులు

కోర్టులో అభ్యంతరం చెప్పిన పోలీసులు

డీఎంకే పార్టీ లీడర్ చిన్నస్వామి కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్‌ జస్టిస్‌ ఏడీ జగదీశ్‌ చంద్ర ముందు విచారణకు వచ్చింది. కేసు విచారణ జరుగుతున్నదని, ఈ సమయంలో నిందితులు ముందస్తుగా కోర్టును ఆశ్రయించినందున బెయిల్‌ మంజూరు చేయ్యరాదని, నిందితులు సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు హైకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.

అధికారంలో ఉన్నామని అహంకారం

అధికారంలో ఉన్నామని అహంకారం

దీనిని అంగీకరించిన న్యాయమూర్తి.. ముగ్గురి బెయిల్ పిటిషన్లను కొట్టివేశారు. చిన్న విషయంలో దారుణంగా సైనికుడు ప్రభును దారుణంగా హత్య చేశారని, సొంత పార్టీ అధికారంలో ఉందని నిందితులు రెచ్చిపోయారని, నిందితులకు బెయిల్ మంజూరు చెయ్యరాదని సైనికుడి కుటుంబ సభ్యులు మనవి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+