business: ప్రభుత్వ షాపుల్లో లిక్కర్ బిజినెస్, లక్షల్లో వ్యాపారం, రాత్రి ఏం జరిగిందంటే ? !
ప్రభుత్వ మద్యం షాపుల్లో తక్కువ ధరకు మద్యం చిక్కుతుందని సామాన్య, అతి సామాన్య ప్రజలకు తెలుసు. ప్రభుత్వ మద్యం షాపుల్లో ప్రతిరోజు లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. లోకల్ గా ఉంటున్న వారికి అయితే ఇంకా చాలాబాగా తెలుసు. ఇక్కడ అసలు ఏ
చెన్నై/తుత్తుకూడి: ప్రభుత్వ మద్యం షాపుల్లో తక్కువ ధరకు మద్యం చిక్కుతుందని సామాన్య, అతి సామాన్య ప్రజలకు తెలుసు. ప్రభుత్వ మద్యం షాపుల్లో ప్రతిరోజు లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ప్రభుత్వ మద్యం షాపుల్లో జరుగుతున్న వ్యాపారం గురించి చాలా మందికి బాగా తెలుసు. లోకల్ గా ఉంటున్న వారికి అయితే ఇంకా చాలాబాగా తెలుసు. ఇక్కడ అసలు ఏం జరిగింది అని తెలుసుకునే లోపు అంతా జరిగిపోయింది.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి సమీపంలోని ఎట్టయ్యపురం పోలీసు పరిధిలోని ముతులాపురం గ్రామంలో టాస్మాక్ (ప్రభుత్వ మద్యం షాప్) దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సూపర్‌వైజర్ అయ్యప్పసామి మరియు ఉద్యోగి కరుప్పసామి ఇద్దరూ విధుల్లో ఉన్నారు. పని ముగించుకుని బయల్దేరి వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో టాస్మార్క్ షాపులోకి ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్ లు వేసుకుని కొడవళ్లు చేతిలో పట్టుకుని ఆ మద్యం షాపులోకి చొరబడ్డారు.

దీని ఆధారంగా టాస్మార్క్ దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అదే ప్రాంతానికి చెందిన విక్రమ్ అలియాస్ విక్కీ (22), ఆనంద్ అలియాస్ అశోక్ (29)లను ఎట్టాయపురం పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన అశోక్‌పై కిడ్నాప్, హత్యాయత్నం, చోరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, విక్రమ్ మీద తమిళనాడులో 5 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు అన్నారు.
ఈ కేసులో వారిద్దరినీ గ్యాంగ్‌స్టర్ నిరోధక చట్టం కింద అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ బాలాజీ శరవణన్ సిఫార్సు చేశారు. తదనంతరం నిందితులు ఇద్దరిని తమిళనాడులోని ప్రత్యేకంగా అమలు చేస్తున్న గ్యాంగ్‌స్టర్ సెక్షనల కింద కేసులు నమోదు చెయ్యాలని జిల్లా కలెక్టర్ సెంథిల్‌రాజ్ ఆదేశాలు జారీ చేశారు. జైలులో ఉన్న విక్కీ, అశోక్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని పోలీసు అధికారులు ఆలోచిస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications