నగ్నంగా స్నానం చేస్తున్న జాతీయ క్రీడాకారిణి: వీడియో తీసిన హోటల్ సిబ్బంది!

Recommended Video

    నగ్నంగా జాతీయ క్రీడాకారిణి: వీడియో తీసిన సిబ్బంది!

    చెన్నై: జాతీయ క్రీడా పోటీసులకు హాజరైన క్రీడాకారిణి స్నానం చేస్తున్న సమయంలో మొబైల్ లో వీడియో తీసిన దారుణ ఘటన చెన్నై నగరంలో జరిగింది. క్రీడాకారిణిని నగ్నంగా వీడియో తీసిన పశ్చిమ బెంగాల్ కు చెందిన అల్లావుద్దీన్ హుస్సేన్ అనే హోటల్ ఉద్యోగిని జైలుకు పంపించారు.

    చెన్నైలో క్రీడా పోటీలు

    చెన్నైలో క్రీడా పోటీలు

    చెన్నై నగరంలోని నెహ్రూ స్టేడియంలో ఇటీవల జాతీయ బాస్కెట్ బాల్ క్రీడా పోటీలు మొదలైనాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు చెన్నై చేరుకుని నెహ్రు స్టేడియంలో జరుగుతున్న క్రీడాపోటీల్లో పాల్గొంటున్నారు.

    ఉత్తరాఖండ్ యువతులు

    ఉత్తరాఖండ్ యువతులు

    ఉత్తరాఖండ్ కు చెందిన బాస్కెట్ బాల్ మహిళా క్రీడాకారులు చెన్నై చేరుకుని నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న క్రీడాపోటీల్లో పాల్గొంటున్నారు. ఉత్తరాఖండ్ కు చెందిన యువతులు చెన్నైలోని పెరియూరులోని వీవీ కోవెల్ స్ట్రీట్ లోని ఓ ప్రైవేటు హోటల్ లో బస చేశారు.

    కామాంధుడు

    కామాంధుడు

    పశ్చిమ బెంగాల్ కు చెందిన అల్లావుద్దీన్ హుస్సేన్ చెన్నై చేరుకుని పెరియూరులోని వీవీ కోవెల్ స్ట్రీట్ లోని హోటల్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన యువతుల మీద అల్లావుద్దీన్ హుసేన్ కన్ను వేశాడు.

    యువతి నగ్నంగా స్నానం!

    యువతి నగ్నంగా స్నానం!

    ఉత్తరాఖండ్ కు చెందిన బాస్కెట్ బాల్ క్రీడాకారిణి స్నానం చెయ్యడానికి వెళ్లిన సమయంలో అల్లావుద్దీన్ హుస్సేన్ ఆమె మీద కన్ను వేశాడు. తరువాత అల్లావుద్దీన్ హుస్సేన్ అతని దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ తో కిటికీలో నుంచి ఆమె నగ్నంగా స్నానం చేస్తున్న సమయంలో మొత్తం వీడియో తీశాడు.

    కిందపడిన మొబైల్!

    కిందపడిన మొబైల్!

    కిటికీ పైకి ఎక్కి వీడియో తీసిన అల్లావుద్దీన్ హుస్సేన్ కిందకు దిగే సమయంలో ఒక్కసారిగా మొబైల్ జారీ కిందపడింది. ఆ సమయంలో చప్పుడు కావడంతో యువతి గమనించి తన టీం కోచ్, మేనేజర్, హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.

    మొత్తం వీడియో తీశాడు!

    మొత్తం వీడియో తీశాడు!

    పోలీసులు అల్లావుద్దీన్ హుస్సేన్ మొబైల్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా యువతి నగ్నంగా స్నానం చేస్తున్న మొత్తం వీడియో తీశాడని వెలుగు చూసింది. వెంటనే అల్లావుద్దీన్ హుస్సేన్ మొబైల్ స్వాధీనం చేసుని కోర్టులో హాజరుపరిచామని, బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన న్యాయమూర్తి అతన్ని జైలుకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారని పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+