రికార్డు సృష్టించబోతున్న చెన్నై మెట్రో.. త్వరలో డ్రైవర్ లెస్ ట్రైన్లు..
ట్రైన్స్ కానీ, బస్సులు కానీ, ఏ వాహనమైనా మనుషులు నడపాల్సిందే. కానీ, చెన్నైలోని మెట్రోలో మాత్రం డ్రైవర్ లేకుండా నడిచే ట్రైన్లు రాబోతున్నాయి. చెన్నై మెట్రో రికార్డు క్రియేట్ చేయబోతుంది. త్వరలోనే చెన్నై మెట్రోలో డ్రైవర్ లెస్ ట్రైన్లు పట్టాలెక్కబోతున్నాయి. ఈ డ్రైవర్ లెస్ ట్రైన్లను మెట్రోపోలిస్ అని పిలుస్తారు. మొత్తం 36 డ్రైవర్ లెస్ ట్రైన్లు త్వరలోనే చెన్నైకి చేరనున్నాయి. ఈ ట్రైన్లను ఫ్రెంచ్ రైళ్ల తయారీ దారు సంస్థ అల్స్టన్ తయారుచేస్తుంది. డ్రైవర్ లేకుండా నడిచే ఈ ట్రైన్లు కేవలం రెండేసీ బోగీలను మాత్రమే కలిగి ఉంటాయి. రండి ఈ ట్రైన్లు ఎక్కడ ప్రయాణిస్తారో, వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.
చెన్నై మెట్రలో త్వరలో ప్రారంభం కానున్న డ్రైవర్ లెస్ ట్రైన్స్ చెన్నైలోని పూనమెల్లి బైపాస్ నుంచి లైట్ హౌజ్ వరకు నడుస్తాయి. ఈ ట్రైన్లు మొత్తం 26 కిలోమీటర్లు క్యారిడార్‌లో నడవనున్నాయి. ఈ ట్రైన్లకు డ్రైవర్ ఉండడు కదా. మరి ఎలా నడుస్తాయి అన్న సందేహం మీకు కలుగొచ్చు. డ్రైవర్ లెస్ ట్రైన్లు ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ సిస్టమ్ తో నడుస్తాయని తయారీ సంస్థ ఆల్ స్టన్ ప్రతినిధులు తెలిపారు. ఈ ట్రైన్స్ పూర్తిగా డ్రైవర్ సహాయం లేకుండానే నడుస్తాయి. డ్రైవర్ లేకుండా నడిచే విధంగా టెక్నాలజీని వినియోగించినట్లు తయారీ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఆపరేటర్ల పర్యవేక్షణలో..
ఈ ట్రైన్స్ ముమ్మాటికి డ్రైవర్ లేకుండానే నడుస్తాయి. అయితే, ఇవి పూర్తి మానవ ప్రమేయం లేకుండా నడిచే ట్రైన్స్ మాత్రం కావు. ఈ డ్రైవర్ లెస్ ట్రైన్స్‌ను కంట్రోల్ సెంటర్ నుంచి అపరేట్ చేస్తారు. ఈ ట్రైన్లు కంట్రోల్ సెంటర్ లోని ఆపరేటర్ల పర్యవేక్షణలో నడుస్తాయి. ఇందులో భాగంగానే ఈ ట్రైన్‌లో ప్రయాణించేవారితో ఆపరేటర్ మాట్లేడుందుకు, ఆదేశాలు జారీ చేసేందుకు మెట్రో ఇంటర్ కామ్ సిస్టమ్‌లను వారు వినియోగిస్తారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications