మోడల్ మిస్సింగ్: ఇంటిలో ప్రత్యక్షం, నాలుగు రోజులు ఎక్కడ: మౌనంగానే: మార్చిలో !

ప్రముఖ మోడల్ గా, ప్రైవేట్ టీవీ చానల్ లో స్క్రీన్ ప్లే రైటర్ గా, ఫోటోగ్రాఫర్ గా, బ్యూటీషన్ గా ప్రతిభచాటుకున్న గానమ్ నాయర్ డిఫ్రెషన్ లో ఉన్నారని పోలీసులు చెప్పారు. అయితే ఇంటి నుంచి వెళ్లి మాయం అయిన గానమ

చెన్నై: నాలుగు రోజులుగా అదృశ్యం అయిన ప్రముఖ మోడల్ గానమ్ నాయర్ అలియాస్ గానమ్ నాయర్ అక జిక్కీ పాదు ఎట్టకేలకు ప్రత్యక్షం అయ్యారు. గానమ్ నాయర్ ప్రస్తుతం చెన్నైలోని బంధువుల ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆమె స్నేహితులు స్పష్టం చేశారు.

ఈనెల 26వ తేదీ శుక్రవారం ఉదయం నలుపు రంగు ఆక్టీవా స్కూటర్ లో ఇంటి నుంచి బయటకు వెళ్లిన గానమ్ నాయర్ తరువాత కనిపించలేదు. నుంగంబాక్కంలోని ఫ్రెండ్ ఇంటికి వెళ్లి త్వరగా తిరిగి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన గానమ్ నాయర్ కనిపించలేదని కేకే నగర మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

సోమవారం రాత్రి ప్రత్యక్షం

సోమవారం రాత్రి ప్రత్యక్షం

గానమ్ నాయర్ సోమవారం రాత్రి కేకే నగర్ లోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఆమె ఒక్కరే స్వయంగా ఇంటికి చేరుకోవడంతో ఆమె బంధువులు షాక్ కు గురైనారు. గానమ్ నాయర్ ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా ఇంటిలో ఉండిపోయారు.

ఫ్రెండ్స్ పరుగు !

ఫ్రెండ్స్ పరుగు !

గానమ్ నాయర్ మాయం కావడంతో ఆమె ఫ్రెండ్స్ ఆందోళనకు గురైనారు. కుటుంబ సభ్యులు కేకే నగర్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గానమ్ నాయర్ స్నేహితులు సోషల్ మీడియా వేదికగా ఇంటి నుంచి వెళ్లిన మా స్నేహితురాలు (గానమ్ నాయర్) కనిపించడం లేదని, ఎవరికైనా సమాచారం తెలిస్తే మాకు చెప్పాలని మనవి చేశారు.

గానమ్ మిస్సింగ్ న్యూస్ వైరల్ !

గానమ్ మిస్సింగ్ న్యూస్ వైరల్ !

గానమ్ నాయర్ మాయం అయ్యారని ఆమె స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వార్త వైరల్ అయ్యింది. ఇదే సమయంలో కేకే నగర్ పోలీసులు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశలో ఆమె కోసం గాలించారు.

డిఫ్రెషన్ లో గానమ్ నాయర్ !

డిఫ్రెషన్ లో గానమ్ నాయర్ !

మోడల్ గా, ప్రైవేట్ టీవీ చానల్ లో స్క్రీన్ ప్లే రైటర్ గా, ఫోటోగ్రాఫర్ గా, బ్యూటీషన్ గా ప్రతిభచాటుకున్న గానమ్ నాయర్ డిఫ్రెషన్ లో ఉన్నారని ఆమె స్నేహితులు సమాచారం ఇచ్చారని పోలీసులు చెప్పారు. అయితే ఆమె మూడు రోజులు ఎక్కడ ఉన్నారు ? అనే విషయంపై త్వరలో విచారణ మొదలుపెడుతామని పోలీసులు అంటున్నారు.

మార్చిలో సోషల్ మీడియాలో ఇలా !

మార్చిలో సోషల్ మీడియాలో ఇలా !

మార్చి నెలలో గానమ్ నాయర్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. తన రెండు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని, ఏడుపు ఆపుకోలేకపోతున్నానని, నాకు ఓదార్పు అవసరం అని పోస్టు చేశారని ఆమె స్నేహితులు పోలీసులకు చెప్పారు.

ఢిల్లీలో గానమ్ నాయర్ ఫ్యామిలీ

ఢిల్లీలో గానమ్ నాయర్ ఫ్యామిలీ

గానమ్ నాయర్ తండ్రి పద్మనాభన్ డిల్లీలో నివాసం ఉంటున్నారు. వివిద రంగాల్లో తన ప్రతిభ చాటుకుంటున్న గానమ్ నాయర్ చెన్నైలోని కేకే నగర్ లో బంధువుల ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఈమె కొంత కాలంగా డిఫ్రెషన్ కు గురైయ్యిందని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని పోలీసులు చెప్పారు.

కిడ్నాప్, ప్రేమ విషయంలో ఆరా !

కిడ్నాప్, ప్రేమ విషయంలో ఆరా !

గానమ్ నాయర్ మిస్సింగ్ కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు చెయ్యాలని పోలీసులు నిర్ణయించారని తెలిసింది. గానమ్ నాయర్ ఎవరినైనా ప్రేమించారా ? అందుకే ఆమె మూడు రోజులు మాయం అయ్యారా అని ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా గానమ్ నాయర్ ను ఎవరైనా కిడ్నాప్ చేశారా ? పోలీసులకు భయపడి చివరికి విదిలిపెట్టారా ? అనే కోణంలో దర్యాప్తు చెయ్యాలని కేకే నగర్ పోలీసులు నిర్ణయించారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+