టెక్కీ రేప్, హత్య: కొత్త కోణాలు, మూడో వ్యక్తి అరెస్ట్
చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఇటీవల జరిగిన టెక్కీ హత్య కేసులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మరో నిందితుడ్ని క్రైం బ్రాంచ్-సిఐడి (సిబి-సిఐడి) పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్కీ హత్యకు సంబంధించి ఆ నిందితుడు తెలిపిన వివరాలు తమకు షాకింగ్‌కు గురి చేశాయని పోలీసులు చెప్పారు. ఇప్పటికే టెక్కీ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ వెళ్లే రైలులో మూడో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏసిబి-సిఐడి అధికారులు ఫిబ్రవరి 26న తెలిపిన వివరాల ప్రకారం.. హత్య కేసులో మూడో నిందితుడు ఉజ్జల్ మండల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాకు చెందిన వాడు. కాగా గురువారం ఉదయం రైలులో ప్రయాణిస్తున్న అతన్ని కోల్‌కతాలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉమా మహేశ్వరి (24) మృతదేహాన్ని చెన్నై సమీపంలోని స్పికోట్ ఐటి పార్క్ వద్ద శనివారం పోలీసులు గుర్తించారు. టెక్కీపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్యపై దర్యాప్తు జరిపిన పోలీసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఉత్తమ్ మండల్ (24), రామ్ మండల్ (21)లను మూడు రోజుల క్రితం అరెస్ట్ చేశారు.
తమిళనాడు ప్రభుత్వం టెక్కీ హత్య కేసును సిబి-సిఐడికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక టెక్కీ హత్య కేసులో నిందితుల సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. కాగా మూడో నిందితుడు ఉత్తమ్ టెక్కీ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాడు. తాము గత ఎనిమిది నెలల నుంచి చెన్నైలో ఉంటున్నట్లు పోలీసులకు తెలిపాడు. బాధితురాలు రాత్రి 10.15గంటలకు తన ఆఫీసు నుంచి బయటికి వచ్చిందని తెలిపాడు.
కాసేపు ఆమెను వెంబడించి బలవంతంగా దగ్గరలోని పొదల్లోకి తీసుకెళ్లినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపాడు. అనంతరం కత్తితో పొడిచి చంపేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఆమె దగ్గర ఉన్న మొబైల్ ఫోన్, క్రెడిట్ కార్డ్స్ దొంగిలించినట్లు తెలిపాడు. కాగా టెక్కీ హత్యకు మరికొంత మంది కూలీల ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications