పోర్న్ వీడియోలు చూశారో కటకటాల పాలే...
మహిళలపై హత్యలు, అత్యాచారాలకు అసలు కారణం ఏమిటీ, వీటికి ప్రోత్సాహాన్ని ఇస్తున్న పరిస్థితులు ఏవి, ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలకు కారణమవుతున్న వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయనే దానిపై తమిళనాడు పోలీసులు డేగ కన్ను విధించారు. దీంతో అత్యాచారాల ఆలోచనకు బీజం వేసే పోర్న్ వీడియోలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే అత్యాచారాలను ప్రోత్సహించేందుకు కారణమైన పోర్న్ వీడియోలు ఎవరు చూస్తున్నారు. వాటిని ఎవరు పోస్ట్ చేస్తున్నారు. వ్యతిగత ఖాతాల్లోకి పోర్న్ వీడియోలు ఎలా వస్తున్నాయనే దానిపై అక్కడి పోలీసులు నిఘా పెంచారు.

పోర్న్ వీడియోలతో యువతో చెడు మార్గం
ఈ పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్న వారితో ప్రమాదం ముంచుకువచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వారిని గుర్తించారు. షాకింగ్ విషయం ఎమిటంటే... పోర్న్ వీడీయోలు చూసే వారిలో మహిళలు కూడ ఉండడం వారు గుర్తించడం గమనార్హం. దీంతో ఎక్కువగా పోర్న్ వీడియోలు పోస్టు చేస్తూ...వాటిని చూస్తున్న వారిపై పోలీసులు కొరఢా ఝలిపించనున్నారు. ఇలా ఎక్కువగా వీడియోలు చూస్తున్న వారి వివరాలు పోలీసులు సేకరించారు.

పోర్న్ వీడియోలు చూస్తున్న 3000 మంది గుర్తింపు
అశ్లీలతకు ప్రాధాన్యమిస్తూ పోర్న్ వీడీయోలు చూస్తున్న సుమారు మూడు వేల మంది అడ్రస్‌లు పోలీసులు కనుగొన్నారు. వీరిలో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. మరికొంతమందిని కూడ అరెస్ట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుచ్చికి చెందిన క్రిష్టోఫర్ అల్ఫోన్స్ రాజా అనే వ్యక్తి ఆదవన్ పేరిట ఓ మెసెంజర్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని అశ్లీల వీడియోల్ని ఇష్టానుసారంగా షేర్ చేస్తూ రావడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అతడ్ని మొదటి సారిగా అరెస్టు చేశారు.

చెన్నై మహిళల రక్షణ కు ప్రత్యేక బృందాలు
చెన్నైలోని మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ఇందుకోసం కసరత్తు చేస్తుంది. హైదరాబాద్‌లో దిశ సంఘటన జరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా మహిళల రక్షణకు ఆయా రాష్ట్రాలు నడుం బిగించిన విషయం తెలిసిందే..ఇందులో బాగంగానే అటు న్యాయవవస్థతో పాటు పోలీసు వ్యవస్థలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దీంతో అత్యాచారాలకు ముఖ్య కారణమైన పోర్న్ వీడియోలపై చెన్నై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications