డేటింగ్ ప్రియుడు: ఇప్పటికే సెంచరీ కొట్టేశాడు, టార్గెట్ 365, ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తాడట
తమిళ సినిమా నటుడు, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ సుందర్ రాము. ఇతడు ఇప్పటి వరకు 100 మంది మగువలతో డేటింగ్ పూర్తిచేశాడట.
చెన్నై: మగువలతో ఎంజాయ్ చేయడమే పురుష లక్షణం అని చాలామంది భావిస్తుంటారు. దీనికి పాశ్చాత్య పోకడలూ కొంత కారణం కావచ్చు. ఇటీవలి కాలంలో డేటింగ్ పేరిట ఇటువంటి వ్యవహారాలు పెరిగిపోయాయి.
ఈ కోవకే చెందుతాడు తమిళ సినిమా నటుడు, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ సుందర్ రాము. ఇతడు ఇప్పటి వరకు 100 మంది మగువలతో డేటింగ్ పూర్తిచేశాడట. ఈ విషయాన్ని అతడే ప్రకటించాడు.
అంతేకాదు, ఈ ఏడాది చివరినాటికి 365 మంది మగువలతో డేటింగ్ పూర్తి చేయాలన్నదనే తన లక్ష్యమని కూడా వెల్లడించాడు. ప్రతీ రోజు ఒక మగువతో రాము డేటింగ్ చేస్తాడు.

షరతులు వర్తిస్తాయి...
సుందర్ రాము తాను చేసే డేటింగ్ కోసం కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టుకున్నాడు. డేటింగ్ కోసం ఇతడు అందమైన పర్యాటక ప్రాంతానికి వెళ్లడు. అలాగే రెస్టారెంట్‌లో ప్రత్యేక ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడు.
ఎదుటి వ్యక్తి ఏం ఆర్డర్ చేస్తే దానినే స్వీకరిస్తాడు. బిల్లు కూడా డేటింగ్ కు వచ్చిన యువతే చెల్లించాలి. ఇప్పటి వరకూ 21 సంవత్సరాల యువతి నుంచి 105 సంవత్సరాల వృద్ధురాలి వరకూ వివిధ వయసుల వారితో రాము డేటింగ్ చేశాడట.
డేటింగ్ సందర్భంగా సుందర్.. ఆ యువతితో ఫొటో తీసుకోవడంతో పాటు, ఆమె భావాలను తెలుసుకుంటాడు. ఇతడు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో డేటింగ్ చేశాడు. వీరిలో హీరోయిన్ శ్రియ శరణ్, ఆర్‌జె సుచిత్ర తదితరులు ఉన్నారు. ఒక డిఎంకె నేత ఇంటికివెళ్లి అతని భార్యతోనూ డేటింగ్ చేసినట్లు పేర్కొన్నాడు.
అయితే సుందర్ రాము సాగిస్తున్న ఈ డేటింగ్ వెనుక ఒక ఉదాత్తమైన కారణం ఉంది. ఇతడు డేటింగ్ చేసేది అమ్మాయిలపై వ్యామోహంతో కాదు. ఈ డేటింగ్ ద్వారా రోజూ తనకు ఆదా అయ్యే ఒకపూట భోజనం ఖర్చును అతడు ఓ సేవా సంస్థకు విరాళంగా అందిస్తున్నాడట. అదీ అసలు విషయం.. ఇలాంటి ఆలోచన వచ్చిన సుందర్ రాము నిజంగా అభినందనీయుడు కదూ!
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications