techie: సోషల్ మీడియా లవర్స్, గర్ల్ ఫ్రెండ్ ను వదిలేసి ఆమె తల్లితో ఇంజనీర్ ?, ఏం జరిగిందంటే, షాక్ !
ఓ ఇంజనీర్, మరో యువతి వ్యవహారం వీడియో కాల్స్ వరకు వెళ్లింది. గూగుల్ తల్లి పుణ్యమా అంటూ ఇంజనీర్ అతని గర్ల్ ఫ్రెండ్ అడ్రస్ వెతుక్కుంటూ అక్కడికి వెళ్లిన టెక్కీ ప్రియారాలిని వదిలేసి ఆమె తల్లితో ?
చెన్నై/కన్యాకుమారి: ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడు మంచి ఉద్యోగం సంపాధించాలని ఎదురు చూస్తున్నాడు. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్న ఇంజనీర్ సోషల్ మీడియాలో ఎక్కువగా కాలం గడుపుతున్నాడు. ఇదే సమయంలో సేమ్ వాసన ఉన్న అమ్మాయి మనోడికి చిక్కింది. కొంతకాలం చాటింగ్ చేసుకున్నారు. కొంతకాలం తరువాత పోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు. రానురాను వీడియో కాల్స్ వరకు వ్యవహారం వెళ్లింది. సడన్ గా మేడమ్ ఇంజనీర్ కు హ్యాండ్ ఇచ్చింది. గూగుల్ తల్లి పుణ్యమా అంటూ ఇంజనీర్ అతని గర్ల్ ఫ్రెండ్ అడ్రస్ వెతుక్కుంటూ జిల్లాలు దాటుకుని వెళ్లాడు. తీరా ప్రియారాలిని వదిలేసి ఆమె తల్లితో ఆ ఇంజనీర్ ?

ఇంజనీరింగ్ పూర్తి చేశాడు
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా రెడియార్ తోట ప్రాంతంలో కిషోర్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బీటెక్ ఇంజినీర్ పూర్తి చేసిన కిషోర్ అతని ఇంటి దగ్గరే ఉంటున్నాడు. గత ఏడాది కిషోర్‌కు ఫేస్‌బుక్ ద్వారా తమిళనాడులోని కన్యాకుమారిలో నివాసం ఉంటున్న షాలియా అనే యువతితో పరిచయం ఏర్పడింది. తరువాత కిషోర్, షాలియా నిత్యం చాటింగ్ చేసుకున్నారు.

వీడియో కాల్స్, ఆన్ లైన్ గిఫ్ట్ లు
కొంతకాలం తరువాత షాలియా, కిషోర్ వాళ్ల సెల్ ఫోన్ నంబర్లు షేర్ చేసుకోని నేరుగా మాట్లాడుకోవాడం, వాట్సాప్ చాట్ లో చాటింగ్ లు చేసుకోవడం చేశారు. కొంతకాలం తరువాత కిషోర్, అతని గర్ల్ ఫ్రెండ్ షాలియాతో ఏకంగా వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకోవడం, ఏకాంతమైన విషయాలు షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. రానురాను ఆన్‌లైన్ షాపింగ్ ల ద్వారా ఇరువురు బహుమతులు పంచుకోవడం చేశారు.

హ్యాండ్ ఇచ్చిన గర్ల్ ఫ్రెండ్
కిషోర్ అతని గర్ల్ ఫ్రెండ్ షారియా ఆర్థిక లావాదేవీల వరకు వెళ్లారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. తన ప్రియురాలు షారియా తనను పెళ్లి చేసుకుంటుందని కిషోర్ గుడ్డిగా నమ్మాడు. షాలియా ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన కిషోర్ తనకు వేరే ప్రపంచం లేదని అనుకున్నాడు. నిత్యం షాలియా, షాలియా అంటూ కిషోర్ పరితపించిపోయాడు.

వన్ సైడ్ లవర్ గా ?
నిన్ను పెళ్లి చేసుకుంటానని, నీతో జీవితాంతం కలిసి ఉంటానని కిషోర్ అతని ప్రియురాలు షాలియాకు చెప్పాడు. మా తల్లిదండ్రులు మన పెళ్లికి ఒప్పుకోరని, మనం విడిపోయి స్నేహితుడిగా కొనసాగుదామని షాలియా అతని ప్రేమను తిరస్కరించింది. అచినా కిషోర్ మాత్రం వన్ సైడ్ లవర్ గా షాలియాను ప్రేమిస్తూనే ఉన్నాడు. షాలియాతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు.

తెగించిన ప్రియుడు
నేనే నేరుగా మీ ఇంటికి వచ్చి నిన్ను ఇచ్చి పెళ్లి చెయ్యమని అడుగుతాను అంటూ కిషోర్ షాలియా ఇంటి చిరునామా అడిగాడు. దీని తరువాత షాలియా కిషోర్‌తో మాట్లాడటం మానేసింది. కిషోర్ ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. దీంతో విసుగు చెందిన కిషోర్ కృష్ణగిరి జిల్లా నుంచి బయలుదేరి అనేక జిల్లాలు దాటుకుంటూ కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్ చేరుకున్నాడు.

గూగుల్ తల్లి..... లోకేషన్ చెప్పమ్మా
నాగర్ కోవిల్ నుంచి గూగుల్ లొకేషన్ ద్వారా షారియా నివాసం ఉంటున్న కన్యాకుమారి సమీపంలోని ఊరు కనిపెట్టి బయంకుజీ ప్రాంతానికి వెళ్లాడు. ఇక్కడ షాలియా పేరు చెప్పి ఆమె ఇల్లు ఎక్కడ అని తెలుసుకుని నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు. సాయంత్రం పూట షాలియా ఇంటికి వెళ్లిన కిషోర్ నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ షాలియాతో గొడవ పెట్టుకున్నాడు. షాలియా తల్లిదండ్రులతో మాట్లాడి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కిషోర్ అడిగాడు.

ప్రియురాలిని వదిలేసి ఆమె తల్లితో ?
కిషోర్ రెచ్చిపోవడంతో షాలియా తల్లి అభ్యంతరం వ్యక్తం చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కిషోర్ కు వార్నింగ్ ఇచ్చింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన కిషోర్ షాలియా తల్లి మీద దాడి చేశాడు. ఇది చూసిన ఇరుగుపొరుగు వారు షాలియా తల్లిని రక్షించారు. కిషోర్ ను పట్టుకుని చితకబాది అతనిడి పోలీసులకు అప్పగించారు. పోలీసులు పట్టుకున్న తరువాత కూడా కిషోర్ రెచ్చిపోయాడు. నన్ను మోసం చేసిన నిన్ను వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను అని షాలియాను బెదిరించాడు. కేసు విచారణలో ఉంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications