నేనే ఓ పెద్ద భిక్షగాడినంటూ సాఫ్ట్‌వేర్ కుర్రాడి లేఖ

చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నై మహానగరం సోమవారం నాటికి కాస్త తేరుకుంది. ఆరోజు రాత్రి ముుంచెత్తిన వరద భీభత్సం కళ్ల ముందు మెదిలితే ప్రతిఒక్కరూ గజగజలాడిపోతున్నారు.

కట్టుబట్టలతో మిగిలిన దైన్యాన్ని వివరిస్తున్నారు. ఆదుకునే ఆపన్నహస్తం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ, ఆహార పదార్దాలతో వచ్చిన వాహనం దగ్గరకు పరుగెత్తుకెళ్లి చేతులు చాస్తున్న వైనం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

వరదల సమయంలో తన దైన్యాన్ని లేఖ రూపంలో ఓ చెన్నై సాప్ట్‌వేర్ ఈ విధంగా వివరించాడు. నేను అమెరికాకు చెందిన ఓ సాప్ట్‌వేర్ కంపెనీ, చెన్నై విభాగంలో విధులు నిర్వహిస్తున్నా. ఏడాదికి 18 లక్షల వార్షిక వేతనం.

Chennai software engineer letter on floods

త్రిబుల్ బెడ్ రూం ఇంటికి ఓనర్‌నని గర్వంగా భావిస్తుంటాను. నాకు రెండు క్రెడిట్ కార్డులున్నాయి. వాటిలో లక్ష రూపాయలకు పైగా క్రెడిట్ లిమిట్ ఉంది. నా అకౌంట్‌లో రూ. 65వేల బ్యాలెన్స్ ఉంది.

నిన్నటి వరకూ రాబోయే 15 శాతం శాలరీ హైక్ గురించే ఆలోచించాను. ప్రస్తుతం సహాయక బలగాలు విసిరే ఆహార పొట్లం కోసం అత్రుతగా ఎదురు చూస్తున్నా. టెస్ట్ బాగాలేదని బిర్యానీ పార్సిల్‌ను పక్కన పడేసిన నేను.. పులిహోర పొట్లం కోసం పెద్ద యుద్ధయే చేస్తున్నాను.

మినరల్ వాటర్ తప్ప వేరే నీటిని ముట్టిన నేను... గుక్కెడు మంచినీరందించే మహాత్ముడెక్కడా అని దీనంగా ఎదురుచూస్తున్నాను. జేబు నిండి పది రూపాయల కాగితాలు నింపుకొని గుడిమెట్ల మీద వారికి దానం చేసే వాణ్ణి.ఇప్పుడు తెలుస్తుంది ప్రకృతి కన్నెర చేస్తే? నేనే ఓ పెద్ద భిక్షగాడినని.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+