విషాదం:మాంజా మెడకు చుట్టుకొని టెక్కీ మృతి, ఆగని మాంజా విక్రయాలు

పతంగులు ఎగురవేసేందుకు ఉపయోగించే మాంజా మెడకు చుట్టుకొని శివప్రకాశం అనే టెక్కీ మరణించాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. మాంజాపై నిషేధం విధించినా కాని ఈ పరిస్థితిలో మార్పు రాలేదు.

చెన్నై:పతంగులకు ఉపయోగించే మంజా కారణంగా ఓ టెక్కీ మరణించగా, అతని తండ్రి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.

పతంగులకు ఉపయోగించే మాంజాను ప్రభుత్వం నిషేధించింది.అయినా నిబంధనలకు విరుద్దంగా ఈ మాంజాను ఉపయోగించడం వల్ల అనేక మంది ప్రాణాలను పోగొట్టుకొంటున్నారు.

Chennai: Techie on bike dies after kite manja slashes neck

పక్షులకు కూడ ఈ మాంజా వల్ల ప్రమాదం వాటిల్లుతోంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ మాంజాను ప్రభుత్వాలు నిషేధించాయి. అయినా కూడ నిబంధనలకు విరుద్దంగా ఈ మాంజాల విక్రయాలు సాగుతూనే ఉన్నాయి.దీంతో పతంగులను ఈ మాంజాల సహయంతో ఎగురవేస్తున్నారు.

చెన్నైలోని 41 ఏళ్ళ టెక్కీ సి. శివప్రకాశం బైక్ మాంజా మెడకు చుట్టుకొని అక్కడికక్కడే మరణించాడు. బైక్ పై తన తండ్రిని తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

విళ్ళివక్కం ప్రాంతానికి చెందిన సి. శివప్రకాశం చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ లోనీలంకారై రోడ్డులోని సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

తండ్రి చంద్రశేఖర్ తో కలిసి తిరిగి వస్తుండగా ఈ పతంగి ఎగురవేసేందుకు ఉపయోగించే మాంజా శివప్రకాశం మెడకు చుట్టుకొని తీవ్రంగా రక్తస్రావం అయింది. దీంతో ఆయన బైక్ పై నుండి కిందపడిపోయాడు.

శివప్రకాశం వెంటనే కిందపడిపోయి చనిపోయాడు. ఆయన తండ్రి చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. శివప్రకాశానికి భార్య , ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.

చెన్నై బైపాస్ రోడ్డులో రెండు గ్రూపులు పతంగుల పోటీలు నిర్వహించుకొన్నాయనే అనుమానాన్ని పోలీసులువ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగానే పతంగులను కట్ చేయడంతో ఉన్న మాంజాను అలాగే వదిలేయడంతోనే బైక్ పై వెళ్ళే శివప్రకాశం మెడకు చుట్టుకొని చనిపోయాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

చెన్నై బైపాస్ రోడ్డులో ఆటో, బైక్ రేసులే కాకుండా పతంగుల పోటీలు కూడ జరుగుతున్నాయనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+