తెలివి తెల్లారినట్టే ఉంది..!బిర్యానీతో పాటు 40 వేలు సమర్పించుకున్న జీనియస్ ఉమెన్..!!
చెన్నై/హైదరాబాద్ : ఆర్డర్ చేసిన డెబ్బై రూపాయల బిరియాని రాకపోయేసరికి తిరిగి ఆ డెబ్బై రూపాయలను పొందడానికి ఏకంగా 40వేల రూపాయలు డిపాజిట్ చేసింది సదరు మహిళ. 70 రూపాయలు తిరిగి పొందడానికి 40వేల రూపాయలను విడతల వారీగా డిపాజిట్ చేసిన సదరు మహిళ కనిపిస్తే ఆమే అపారమైన తెలివి తేటలకు సన్మానిస్తామంటున్నారు నెటిజన్లు.
అసలు విషయం ఏంటంటే బిర్యానీని ఆర్డర్ చేసిన యువతికి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ చుక్కలు చూపించింది. బిర్యానీ రాకపోగా 40 వేల రూపాయలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఉబర్ ఈట్స్ సంస్థ చేసిన ఈ నిర్వాకంపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. చెన్నై సౌకార్‌పేటకు చెందిన ఇరవై ఒక్క ఏళ్ల ప్రియా అగర్వాల్ బుధవారం ఉదయం ఉబర్ ఈట్స్ కంపెనీకి ఆన్‌లైన్‌లో హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేసింది. బిర్యానీ ధర 76 రూపాయలు ఆన్‌లైన్ ద్వారానే చెల్లించింది.

అయితే అకస్మాత్తుగా ఆర్డర్ క్యాన్సిల్ కావడంతో ఉబర్ ఈట్స్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయగా, మీరు చెల్లించిన 76 రూపాయలు తిరిగి పొందాలంటే ముందుగా 5 వేల రూపాయలు చెల్లించండి, మేము 5,076 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. వారు చెప్పిన ప్రకారమే 5 వేల రూపాయలు చెల్లించినా డబ్బు వెనక్కి రాలేదు. దీంతో మరలా కాల్ సెంటర్‌ను సంప్రదించగా మరోసారి 5 వేల రూపాయలు చెల్లించండని చెప్పారు.
ఇలా 8 సార్లు 5 వేల రూపాయల చొప్పున మొత్తం 40 వేల రూపాయలు చెల్లించింది. అయితే ఆమె 76 రూపాయలతో పాటూ 40 వేల రూపాయలను కూడా కోల్పోయింది. తాను మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించిన ప్రియా అగర్వాల్ చెన్నై వడపళని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సైబర్ క్రైం పోలీసులు ముందుగా ఆమెకు చివాట్లు పెట్టి తర్వాత విచారణ జరుపుతామని సదరు మహిళకు చెప్పినట్టు సమాచారం.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications