నలుగురు మహిళా మావోయిస్టుల హతం
రాయపూర్: చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా నాగలిగూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మహిళా మావోయిస్టులు మరణించారు.
మావోయిస్టులు సమావేశమయినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందండంతో సుమారు 500 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మూడు జట్లుగా చీలిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ జరిపి తిరిగి వస్తున్న నేపథ్యంలో మొదటి దళంపై మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో వెనుకవైపు నుంచి వస్తున్న రెండో దళం మావోయిస్టులపై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి వద్ద ఉన్న విప్లవ సాహిత్యం, నాలుగు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద చత్తీస్‌గఢ్‌లో వరుసగా వారం రోజుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. అందులో ఐదుగురు మహిళా మావోయిస్టులు చనిపోవడం విశేషం.
ఈ ఎన్‌కౌంటర్ ఆదివారం తెల్లవారు జామున జరిగింది. మావోయిస్టుల శిబిరాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. నలుగురు మహిళా మావోయిస్టులు మరణించగా, మిగతా వారు అడవిలోకి పారిపోయినట్లు దంతెవాడ ఎస్పీ చెప్పారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications