దేశమంతా ఆమెపై పొగడ్తలు: వరుడి తాట తీసిన కొత్త పెళ్లి కూతురు..ఏం జరిగిందంటే?
కట్నం కోసమే పెళ్లి చేసుకునే ఇలాంటోడు నాకు వద్దే వద్దంటూ వాదించింది. కుటుంబ సభ్యులు ఎంత వారించినా వినకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కోరియా: వధువు మెడలో తాళి కట్టి కొన్ని గంటలు కూడా గడవకముందే ఓ వరుడు గొంతెమ్మ కోరికలు కోరడం మొదలుపెట్టాడు. ముందుగా అనుకున్న ప్రకారం.. వధువు తరుపువారు కొంత కట్నాన్ని ముట్టజెప్పినా.. అది చాలదంటూ మొండికిపోయాడు. తను అడిగినంతా ఇస్తేనే.. భార్యను తనతో పాటు తీసుకెళ్తానని లేదంటే లేదని తెగేసి చెప్పాడు.
పెళ్లయి కొన్ని గంటలు కూడా గడవకముందే.. భర్త అలా ప్రవర్తించడాన్ని నవ వధువు తట్టుకోలేకపోయింది. ఇలాంటి వాడు నాకు వద్దే వద్దంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రస్తుతం సదరు భర్త గారు కటకటాల పాలయ్యారు. ఛత్తీస్ ఘడ్ లోని కోరియా గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

పోలీసులు కథనం ప్రకారం.. కోరియా గ్రామానికి చెందిన యువతికి సమీప గ్రామానికే చెందిన ఓ యువకుడితో సోమవారం వివాహం జరిగింది.ముందుగా నిర్ణయించిన ప్రకారం వధువు కుటుంబం కట్న కానుకలు ముట్టజెప్పింది. అయితే భార్యను తనతో పాటు తీసుకెళ్లడానికి మరికొంత డబ్బు, ఫ్రిజ్. కూలర్ వంటి వస్తువులు ఇవ్వాలని వరుడు డిమాండ్ చేశాడు.
పెద్ద మనుషులు ఎంత నచ్చజెప్పినా వారి మాటను లెక్క చేయలేదు. మొత్తం వ్యవహారాన్ని మౌనంగా తిలకించిన నవ వధువు ఒక్కసారి ఆగ్రహంతో రగిలిపోయింది. కట్నం కోసమే పెళ్లి చేసుకునే ఇలాంటోడు నాకు వద్దే వద్దంటూ వాదించింది. కుటుంబ సభ్యులు ఎంత వారించినా వినకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడిని అరెస్టు చేశారు. వరుడి దురహంకారాన్ని, వరకట్న దురాచారాన్ని నిర్భయంగా వ్యతిరేకించినందుకు సదరు నవ వధువు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications