మరుగుదొడ్డి నిర్మాణం: కోర్కె తీర్చాలని అధికారి లైంగిక వేధింపులు, బాధితురాలిలా..
రాయ్‌పూర్: స్వఛ్చ భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేస్తోంది. అయితే బహిరంగ మల విసర్జన రహిత దేశంగా ఇండియాను నిలపాలనే ఉద్దేశ్యంతో పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వాల ఆలోచనలకు విరుద్దంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మరుగుదొడ్డి నిర్మాణం కోసం అనుమతి కోసం అధికారులు ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
బహిరంగ మల విసర్జన రహిత దేశంగా ఇండియా చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ముందుకు తీసుకువస్తున్నాయి. అయితే ఈ పధకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో దారుణంగా వ్యవహరిస్తున్నారు.
టెక్నాలజీ పరంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఇంకా కూడ బహిరంగంగానే మల విసర్జన చేయడం అనాగరకం. అయితే దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకొంటున్నాయి.

మరుగుదొడ్డికి అనుమతి కోసం వెళ్తే లైంగిక వేధింపులు
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఓ వివాహిత రాయ్‌గడ్ జిల్లాలోని తెందూదిపాలో క్లీన్ ఇండియా పథకం కింద బాధితురాలు మరుగుదొడ్డి నిర్మాణం కోసం అధికారులకు ధరఖాస్తు చేసింది. అయితే అధికారులు మాత్రం ఆమెకు అనుమతి ఇవ్వలేదు. ఆమె నిర్మిస్తున్న మరుగుదొడ్డి నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారు.

అన్ని ఆధారాలను సమర్పించినా
మరుగుదొడ్డి నిర్మాణం కోసం అన్ని అనుమతులున్నాయని బాధితురాలు రాయ్‌గఢ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు వివరించింది. ఈ ఆధారాలను ఆమె సబ్ ఇంజినీర్ ఐపీ సారథికి సమర్పించారు. కానీ, ఈ ఆధారాలు చూపినా కానీ, మరుగుదొడ్డి నిర్మాణానికి అనుమతించలేదు.

కోరిక తీర్చాలని
మరుగుదొడ్డి నిర్మాణం విషయమై సబ్ ఇంజినీర్ ఐపీ సారథి బాధితురాలికి ఫోన్ చేశారు. తనతో లైంగిక చర్యకు సహకరిస్తేనే మరుగుదొడ్డి నిర్మాణానికి అనుమతిని ఇవ్వనున్నట్టు ఐపీ సారధి తేల్చి చెప్పాడు.అంతేకాదు ఇల్లును కూల్చేస్తానని కూడ అధికారి బెదిరించాడని బాధితురాలు చెప్పారు.

పోలీసులకు ఫిర్యాదు
మరుగుదొడ్డి నిర్మాణానికి అడ్డు పడడమే కాకుండా తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications