ఛోటా రాజన్ ను లేపేస్తాం: ఛోటా షకీల్

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడి భుజం, మాఫియా డాన్ ఛోటా షకీల్ ఎట్టకేలకు నోరు విప్పాడు. వీలైనంత త్వరలో తాము ఛోటా రాజన్ ను అంతం చేసి పగతీర్చుకుంటామని, తమ చేతిలో నుంచి అతను తప్పించుకోలేడని అంటున్నాడు.

ఛోటా షకీల్ ఓ జాతీయా మీడియా సంస్థతో మాట్లాడాడు. గత 20 సంవత్సరాల నుంచి ఛోటా రాజన్ ను అంతం చెయ్యాలని తాము ప్రయత్నించామని, అయితే ప్రతి నిత్యం అతను తప్పించుకుంటున్నాడని అన్నాడు. ఛోటా రాజన్ తో ఉన్న గత పాతకక్షలను ఛోటా షకీల్ గుర్తు చేశాడు.

1993 ముంబై వరుస బాంబు పేలుళ్లలోని ఆరుగురిని (డీ కంపెనీ) ఛోటా రాజన్ గ్యాంగ్ అంతం చేసిందని గుర్తు చేశాడు. 1998-2011 మధ్యలో ఈ హత్యలు జరిగాయని అన్నాడు. ఈ హత్యలను తాము ఇప్పటి వరకు మరచిపోలేదని చెప్పాడు.

Chhota Shakeel vows to take revenge on Chhota Rajan

బాలిలో ఛోటా రాజన్ అరెస్టు అయ్యాడని తెలుసునని, అతనికి మా డీ కంపెనీ కోర్టులో ఇప్పటికే మరణ శిక్ష విధించామని, ఛోటా రాజన్ గ్యాంగు హత్య చేసిన వారిలో యాకూబ్ యేడా సోదరుడు మజీద్ ఖాన్ ఉన్నాడని, మజీద్ దావూద్ తో పాటు తనకు చాల సన్నిహితుడని ఛోటా షకీల్ చెప్పాడు.

సీబీఐ అధికారులు ఛోటా రాజన్ ను ఎందుకు ముంబై పోలీసులకు అప్పగించడం లేదని ప్రశ్నించాడు. ఛోటా రాజన్ మీద ముంబైలోనే అనేక కేసులు ఉన్నాయని అంటూ ఛోటా రాజన్ ఏమైనా సీబీఐ అధికారులకు చుట్టమా అని ప్రశ్నించాడు.

ముంబై పేలుళ్ల కేసులో నిందితులు అంటూ ఆరుగురు నిర్దోషులను అనవసరంగా చంపేశాడని, ఛోటా రాజన్ ను వీలైనంత త్వరగా అంతం చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని ఆదే వుడిని కోరుకుంటున్నామని, తమచేతిలో నుంచి ఛోటా రాజన్ తప్పించుకోలేడని ఛోటా షకీల్ అంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+