నితీశ్ అనూహ్య నిర్ణయం- ఎన్డీఏలో కీలక మలుపు..!!
బీహార్ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. బీహార్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా కేంద్ర బడ్జెట్ లోనూ మోదీ ప్రభుత్వం బీహార్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. భారీ వరాలు ప్రకటించింది. వచ్చే ఎన్నికలకు నితీశ్ ను ఎన్డీఏ సీఎంగా ప్రకటించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఈ సమయంలోనే నితీశ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.
మంత్రివర్గ విస్తరణ
ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ తన మంత్రివర్గ విస్తరణకు సిద్దం అయ్యారు. ఈ సాయంత్రం తన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. కొత్తగా నలుగురు బీజేపీ.. ఇద్దరు జేడీయూ ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం దక్కనుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడంతో రెవెన్యూ మంత్రి దిలీప్ జైస్వాల్ తన పదవికి రాజీనామా చేసారు. దీంతో, ఇప్పుడు ఖాళీగా ఉన్న మంత్రుల స్థానాలను భర్తీ చేయాలని నితీశ్ నిర్ణయించారు. దిలీప్ రాజీనా మాతో ఒక బెర్తు ఖాళీ అవుతుండగా.. కొత్తగా మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు.

నితీశ్ కోసం డిమాండ్
దీని ద్వారా కొత్తగా అయిదుగురు మంత్రులు నితీశ్ కేబినెట్ లోకి రానున్నారు. బీజేపీ నుంచి మం త్రులుగా తార్కిషోర్ ప్రసాద్, సంజయ్ సరోగి, రాజు యాదవ్ మరియు అవధేష్ పటేల్ ఉన్నారు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొత్త జెడి(యు) నుంచి అయిదుగురు పేర్లు ప్రధానంగా రేసులో ఉన్నాయి. ప్రస్తుతం నితీశ్ మంత్రివర్గంలో 15 మంది బీజేపీ, 13 మంది జేడీ(యూ), హెచ్ఎఎం నుంచి ఇకరు, మరో స్వతంత్ర అభ్యర్ధి కొనసాగుతున్నారు. ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను నేడు భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం నుంచి బీహార్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాను న్నాయి. ప్రస్తుత మంత్రులు ఒకటి కంటే ఎక్కువ పోర్టు పోలియోలు నిర్వహిస్తున్నారు. ఇక, నితీశ్ కుమారుడు తాజాగా ఎన్డీఏ సీఎం అభ్యర్దిగా నితీశ్ పేరు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ అంగీకరించేనా
నితీశ్ కుమారుడు నిశాంత్ ఎన్నికలకు ముందే ఈ ప్రకటన చేయాలని కోరారు. దీని ద్వారా తిరిగి కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేసారు. నిశాంత్ కొంత కాలంగా రాజకీయ వ్యవహారాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. 2020లో బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జెడి-యు 43 సీట్లు గెలుచుకోగా, బిజెపి 73 సీట్లు గెలుచుకుంది. ఆర్జెడి 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీష్ కుమార్ ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, నితీష్ ఆర్జేడి.. కాంగ్రెస్‌తో చేతులు కలిపి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. కాగా.. గత ఏడాది జనవరిలో, నితీష్ కుమార్ మళ్ళీ పార్టీ మారి, రికార్డు స్థాయిలో తొమ్మిదవసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక.. ఇప్పుడు బీహార్ లో చోటు చేసుకునే రాజకీయ పరిణామాల పైన ఎన్డీఏ పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications