వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎస్ ఫోన్ ఎత్తరు.. అధికారులు మాట వినరు, ఇక స్పీకర్.. బెంగాల్ గవర్నర్ హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధాంకర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం మమతా బెనర్జీతో కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి ప్రభుత్వ అధికారులపై కామెంట్స్ చేశారు. వారు చట్టానికి లోబడి పనిచేయడం లేదని చెప్పారు. చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. సీఎస్, అసెంబ్లీ స్పీకర్ గురించి కూడా కామెంట్స్ చేశారు.

ప్రభుత్వ అధికారులు చట్టానికి లోబడి పనిచేయడం లేదని చెప్పారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కూడా విరుచుకుపడ్డారు. స్వయంగా తాను ఫోన్ చేసినా తీయరని చెప్పారు. అలాగే స్పీకర్ బిమన్ బెనర్జీపై కూడా విరుచుకుపడ్డారు. బిల్లులు అతని కార్యాలయంలో ఉండవని చెప్పారు. ఇదివరకు హౌరా మున్సిపాలిటీకి సంబంధించిన బిల్లు ఒకటి గవర్నర్ వద్ద ఉందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కౌంటర్ అటాక్ చేశారు.

chief secy doesnt answer calls, govt officers dont follow law:Bengal Governor

తన వద్దకు ఏ బిల్లు వచ్చిన 48 గంటల్లో పంపిస్తానని చెప్పారు. తన వద్ద ఉంచుకోనని చెప్పారు. తన వద్దకు వచ్చి.. సందేహాం ఉంటేనే ఆపుతానని చెప్పారు. అలాంటి పరిస్థితి ఇప్పటివరకు రాలేదని వివరించారు. కానీ తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని తప్పుపట్టారు. కానీ స్పీకర్ మాత్రం తాను చట్టానికి అతీతుడిలా ప్రవర్తిస్తున్నారని.. పేర్కొన్నారు.

గవర్నర్ ఆరోపణలపై స్పీకర్ స్పందించారు. గవర్నర్ చేసిన కామెంట్స్‌ తన దృష్టికి రాలేదని చెప్పారు. ఆయన గవర్నర్ నివాసంలో మాట్లాడి ఉంటారని.. అసెంబ్లీ వద్ద కాదని చెప్పారు. అంతేకాదు ముఖ్యమైన బిల్లులను గవర్నర్ వద్ద ఉన్నాయని.. ఈ విషయాన్ని రాష్ట్రపతికి నివేదిస్తామని చెప్పారు. తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. ఈ లోపే జగదీప్ కామెంట్స్ చేయడం విశేషం.

English summary
West Bengal Governor Jagdeep Dhankhar on Tuesday lashed out at the state bureaucrats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X