Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వామ్మో డేంజర్ : భవనం నుంచి కిందపడి.. రిక్షాలోకి జారిపడి..! (వీడియో)

భోపాల్ : వామ్మో డేంజర్ అనేలా మధ్య ప్రదేశ్‌లో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది. దురదృష్టవశాత్తు ఓ చిన్నారి భవనంపై నుంచి పడింది. అయితే అదృష్టమో ఏమో గానీ అటుగా వెళుతున్న రిక్షాలో పడిపోయింది. దాంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనకు సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మధ్యప్రదేశ్‌లో టికాంగఢ్ ప్రాంతంలో రెండో అంతస్థు నుంచి పొరపాటున ఓ చిన్నారి కిందకు పడింది. ఆడుకునే సమయంలో బాల్కనీలోకి వచ్చిన ఆ బాలుడు అదుపు తప్పి కిందకు జారి పడ్డాడు. దాంతో కుటుంబ సభ్యులు పరుగున కిందకు పరుగెత్తుకుంటూ వచ్చారు. అయితే అదృష్టవశాత్తు ఆ చిన్నారి అటుగా వెళుతున్న రిక్షాలోకి పడిపోయింది.

 child falls of terrace into passing rickshaw in madhya pradesh

సరిగ్గా చిన్నారి కింద పడే సమయంలో అటుగా రిక్షా వెళ్లడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. సదరు చిన్నారి నేరుగా రిక్షాలోకి జారి పడటంతో స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. లేదంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేదని అంటున్నారు తల్లిదండ్రులు. ఘటన జరిగిన వెంటనే వేగంగా పై నుంచి కిందకు పరుగెత్తుకొచ్చి ఆ బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ చిన్నారి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

35 అడుగుల ఎత్తు నుంచి కిందకు జారి పడటంతో తీవ్ర గాయాలు అయిఉంటాయని భావించారు కుటుంబ సభ్యులు. కేవలం స్వల్ప గాయాలై ప్రమాదం నుంచి బయటపడటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. సమీపంలోని సీసీ టీవిల్లో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. అవి కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+