ప్రియుడి కోసం పిల్లాడి కిడ్నాప్.. సింగం 3 యాక్టర్ అరెస్టు!
సింగం 3 సినిమాలో నటిస్తోన్న యాక్టర్ షబ్రిన్ కిడ్నాప్ కేసులో అరెస్టు కావడం సంచలనంగా మారింది. ఆమె క్రైమ్ పెట్రోలింగ్ సిరిస్‌లో మహిళా పోలీసుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా షబ్రిన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అరెస్టుకు సంబంధించి పోలీసులు చెబుతోన్న వివరాలు ఇలా ఉన్నాయి.
వసాయ్‌లో వాలీవ్ పోలీసులు రెండున్నరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన కేసులో నటి షబ్రిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈమె క్రైమ్ సిరీస్‌లతో పాటు ప్రస్తుతం సింగం 3 సినిమాలో కూడా నటిస్తోంది. ఈ కిడ్నాప్ కేసులో ఆమెకు సహకరించిన మరొక మహిళ గురించి వెతుకుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిజానికి, షబ్రిన్ బ్రిజేష్ సింగ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. కానీ, అతను వేరే వర్గానికి చెందినవాడు కావడంతో వారి కుటుంబం పెళ్లికి నిరాకరించింది. ఆమె ఎంత ప్రయత్నించినా వారు అంగీకరించలేదు. ఈ విషయంలో ఆగ్రహంతో ఉన్న షబ్రిన్ తన ప్రియుడు బ్రిజేష్ మేనల్లుడు మసూమ్‌ను కిడ్నాప్ చేసేందుకు పతకం పన్ని అమలు చేసింది.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా..
ఎప్పటిలాగే రెండున్నరేళ్ల మసూమ్ క్లాసుకి వెళ్లాడు. శనివారం ఉదయం 11 గంటలకు షబ్రీన్ ఆ బాలుడ్ని స్కూలు నుంచి తీసుకుని వెళ్లిపోయింది. అయితే, మధ్యాహ్నం వరకు మసూమ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్కూల్‌కు వెళ్లి విచారించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, షబ్రిన్ పిల్లాడిని ఆటోలో తీసుకవెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అందులో ఆమెతో పాటు మరో మహిళ ఉన్నట్లు వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ప్రియుడి పాత్రపై అనుమానాలు..
బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలుడ్ని తీసుకవెళ్లింది షబ్రిన్ అని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆటోడ్రైవర్ ద్వారా వారు నయీగావ్‌లో దిగినట్లు తెలుసుకున్నారు. మొబైల్ లోకెషన్ ద్వారా ఆమె ఉన్న ప్రాంతాన్ని గుర్తించి షబ్రిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీగావ్ లోని ఓ ఫ్లాట్‌లో చిన్నారిని సురక్షితంగా ఉన్నట్లు విచారణలో ఆమె తెలిపింది. ఈ కిడ్నాప్ వ్యవహరంలో షబ్రిన్ ప్రియుడు బ్రిజేష్ పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications