షాక్: ఐఎఎస్ అధికారి ఇంట్లో బూతు వీడియోలు

బెంగళూరు: విచారణ కోసం ఐఎఎస్ అధికారి ఇంటికి వెళ్లిన సిఐడి, ఐటి అధికారులు షాక్ తిన్నారు. ఆ అధికారి కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లో ఆధారాలు దొరకుతాయని భావిస్తే వాళ్లకు దిమ్మ తిరిగే వీడియోలు చిక్కాయి. కర్ణాటకలోని ఐఏఎస్ ఆఫీసర్, క్రీడా యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి కపిల్ మోహన్ ఇంట్లో అశ్లీల చిత్రాల వీడియోలు బయటపడ్డాయి.

స్వాధీనం చేసుకున్న డిస్క్‌లో పిల్లలకు సంబంధించిన పోర్న్ వీడియోలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అశ్లీల చిత్రాలున్న హార్డ్ డిస్క్‌తో పాటు అక్రమ డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కపిల్ మోహన్ తండ్రి, అతని కుమారుడు పేరు మీద ఉన్న ఇంట్లో ఈ సోదాలు జరిగాయి. పోర్న్ ఫిల్మ్స్‌లో ఏడు ఏళ్ల లోపు పిల్లలు నటించిన వీడియోలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.

‘Child porn’ charge on IAS official under probe for corruption in Karnataka

కపిల్ మోహన్‌కు చెందిన కంపెనీలకు రాష్ట్ర శాఖల నుంచి భారీ మొత్తంలో రుణాలు అందినట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలపై సిఐడి, ఐటి అధికారులు సోదాలు జరిపారు.

అధికారులు స్వాధీనం చేసుకున్న 20 సీడీల్లో సాధారణ నీలిచిత్రాలు, ఒక సీడీలో చైల్డ్ పోర్న్ ఉన్నట్లు లోకాయుక్త పోలీసులు గుర్తించారు. దీంతో ఈ విషయమై లోకాయుక్త అధికారులు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసి ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరారు. కమిషనర్ సూచనలతో కపిల్ మోహన్‌పై ఐటీ యాక్ట్-67( బీ)ను అనుసరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఐఏఎస్ అధికారి ఇంట్లో గత ఆగస్టు ఐదో తేదీన సీఐడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన సోదాల్లో రూ.4.50 కోట్ల నగదు, వజ్రాభరణాలు వివిధ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 28 సీడీలు, ఒక హార్డ్ డిస్క్‌ను ఆసమయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+