'చిన్నారుల అశ్లీల చిత్రాల నిషేధంపై సూచనలివ్వండి'
ఢిల్లీ: చిన్నారులకు సంబంధించిన అశ్లీల చిత్రాల నిషేధం పైన సూచనలు అందజేసేందుకు సుప్రీం కోర్టు కేంద్రంకు రెండు వారాల గడువును ఇచ్చింది. కేంద్రం రెండు వారాల గడువు అడిగింది. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 18 నుంచి మొదలయ్యే వారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
కేంద్రానికి సుప్రీం నోటీసులు
బహు భార్యత్వం, తలాక్ వంటి ముస్లిం సంప్రదాయాలకు ఉన్న రాజ్యాంగబద్ధతపై కేంద్రం స్పందించాలని సుప్రీం కోర్టు సోమవారం నాడు సూచించింది. సదరు సంప్రదాయాలు ముస్లిం మహిళల అభివృద్ధికి అవరోధంగా నిలుస్తున్నాయంటూ షాయరా బానో అనే మహిళ కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ యుయు లలిత్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. తన భర్త తనను తీవ్రచిత్రహింసలకు గురి చేసి, తాను మానసికంగా, శారీరకంగా అనారోగ్యం పాలైన తర్వాత తనకు మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడని షాయరా బానో కోర్టుకు ఎక్కింది.












Click it and Unblock the Notifications